మహిళపై వైసీపీ నాయకుడి దౌర్జన్యం
Atrocity on Women by YCP Leader: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లెలో దారుణం చోటుచేసుకుంది. స్థలం విషయంలో వైసీపీ నాయకుడికి, ఓ మహిళ మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకుడు ఆ మహిళపై దాడికి తెగబడ్డాడు.
YCP Leader Convicted Violence Against Women: ఇంటి స్థలం విషయంలో మహిళ కుటుంబానికి, గ్రామంలోని వైసీపీ నాయకుడికి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. బాధిత మహిళ తన స్థలాన్ని మరొకరికి విక్రయించారు. ఆ స్థలంలో సెంటున్నర స్థలం భాగం తనకు ఉందని వైసీపీ నాయకుడు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆమె కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని.. స్థలంలో బండలు పాతుకుంది. అయితే ఈ బండల్ని వైసీపీ నాయకుడి అనుచరులు దౌర్జన్యంగా తొలగిస్తుండగా మహిళ అడ్డుకోబోయింది. మహిళను ఈడ్చి.. వేసిన బండలను తొలగించారు. వైసీపీ నాయకుడి దౌర్జన్యం పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని వైసీపీ నాయకుడని కఠినంగా శిక్షించి.. తగిన న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది.