ఆరోగ్య శ్రీ నిధులపై ఆరోగ్యశాఖకు ఏపీ ప్రైవేటు హస్పిటల్స్ ఆసోషియేషన్ లేఖ
AP Private Hospitals Association Letter: ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు.. ఏపీ ప్రైవేటు హస్పటల్స్ ఆసోషియేషన్ లేఖ రాసింది. గడచిన ఆరు నెలల కాలంలో ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం కింద.. 1000 కోట్ల రూపాయల వరకు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉందని లేఖలో పేర్కోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ పేరుతో ఉన్న పెండిగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి హస్పటల్స్ అసోసియేషన్ లేఖ రాయగా.. నిధులు పెండింగ్లో ఉండటం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోంటున్నామని లేఖలో వివరించింది. ఆరోగ్య శ్రీ అందిస్తున్న చికిత్సల ప్యాకేజీని కూడా పెంచాలని ఆరోగ్య శాఖను కోరింది. వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగాయని వివరించింది. అందువల్ల ప్యాకేజీ ధరలను పెంచాలని.. నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ ఆ ధరలను పెంచాలని కోరింది. ప్రజా శ్రేయస్సు కోసమే ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు వివరించారు. ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటే.. అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఇంతవరకు ప్రభుత్వం దృష్టికి వెళ్లలేదని అనుకుంటున్నట్లు హస్పటల్స్ ఆసోషియేషన్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.