వాళ్లు మాత్రమే గుత్తేదారులా ? మేము కాదా ? - ఏపీ కాంట్రాక్టర్ల సంఘం ఆగ్రహం
AP Contractors Fires on CM Jagan in Vijayawada : ఒక ప్రాంతం గుత్తేదారులకు మాత్రమే బిల్లులు చెల్లిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ఏపీ గుత్తేదారుల సంఘం మండిపడింది. ప్రభుత్వ నిర్ణయం దారుణమని తమ జీవితంలో ఇలాంటి జీవో ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. రాజ్యంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి అందరినీ సమానంగా చూడాలని, పక్షపాతంగా పాలన చేయడం రాజ్యంగ విరుద్దమన్నారు. పులివెందుల, డోన్‌లో వాళ్లు మాత్రమే గుత్తేదారులా ? తాము కాదా అని ప్రశ్నిస్తున్నారు. తాము చేసిన అభివృద్ది పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అనేక సంవత్సరాలుగా అడుగుతున్నా పట్టించకోకుండా.. నేడు పులివెందుల, డోన్ లో గుత్తేదారులకు మాత్రమే బిల్లులు ఇవ్వడం ముఖ్యమంత్రి పక్షపాతం చూపినట్లు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన మిగిలిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్న గుత్తేదారుల సంఘం ప్రతినిధులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.