ఒళ్లు జలదరించే విన్యాసాలతో 'డౌన్​ హిల్'​ రేస్​

By

Published : Jan 22, 2021, 4:57 PM IST

thumbnail

ఒళ్లు గగుర్పొడిచే రేసు​లో మొదటి స్థానంలో ఉంటుంది ఈ డౌన్​ హిల్​ రేసు. ఎత్తైన పర్వతాల మీదుగా దూకుతూ ఈ రేసు​ చేయడం మామూలు విషయం కాదు. పొరపాటు జరిగితే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. అందుకే ఈ రేస్​లో పాల్గొనాలంటేనే చాలా మంది వణికిపోతారు. అయితే ఈ డౌన్​హిల్​ రేస్​ను ప్రముఖంగా ఆస్ట్రియాలోని హానెన్​క్యామ్​ పర్వతా ప్రాంతంలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. 81వ హానెన్​క్యామ్​ ​రేస్​ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 24 వరకు జరగనుంది. ప్యారాచ్యూట్​లు వేసుకుని రెడ్​బుల్​ స్కైడైవ్​ టీం ఈ రేసులో పాల్గొంది. పర్వతంపై నుంచి దూకుతూ వేగంగా.. మంచు మీద అతి కొద్ది ఎత్తులో ఈ రేస్​ను పూర్తిచేసింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.