పురిటి నొప్పులతో భారీ ట్రాఫిక్​లో చిక్కుకున్న గర్భిణీ.. తర్వాత ఏమైందంటే!

By

Published : Feb 5, 2022, 7:02 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​ ముస్సోరీలో ట్రాఫిక్​లో చిక్కుకున్న గర్భిణీని స్థానికులు, పోలీసులు కలిసి ఆస్పత్రికి తరలించారు. ముస్సోరీలో ఎడతెగకుండా మంచువర్షం కురుస్తోంది. దీని కారణంగా శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపోయాయి. ఈ సమయంలోనే పురిటి నొప్పులతో ట్రాఫిక్​లో చిక్కుకుని అవస్థలు పడుతోంది ఓ గర్భిణి. ఈ క్రమంలో ఆమె భర్త.. ఇతర వాహనదారులను సాయం కోరాడు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసుల సహకారంతో గర్భిణీని ట్రాఫిక్​ దాటించారు. తల్లి, బిడ్డను కాపాడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.