1000 కేజీల దున్నపోతు.. బర్త్​డే వేడుకలు అదుర్స్​

By

Published : Feb 4, 2022, 8:40 PM IST

thumbnail

Farmer Celebrates Birthday of Buffalo: కేరళ మలప్పురానికి చెందిన బషీర్​ అనే రైతు.. 1000 కేజీలకుపైగా బరువున్న దున్నపోతుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. స్థానిక వార్డు సభ్యుడు కేక్​ కట్​ చేశాడు. రాజమాణిక్యన్​ అని పిలుచుకునే ఈ దున్నను నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేశాడు బషీర్​. అప్పటినుంచి తన సొంతబిడ్డలా చూసుకుంటున్నాడు. రూ. 10 లక్షలు ఇస్తామన్నా.. దీనిని ఇవ్వనంటున్నాడు ఆ రైతు. ముర్రా జాతికి చెందిన ఈ బఫెలోకు ప్రత్యేక ఆహారం, నీరు సమకూరుస్తాడు. బరువు ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం డైట్​ చేయిస్తున్నాడు. బషీర్​, రాజమాణిక్యన్​ బంధాన్ని చూసి స్థానికులు మెచ్చుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.