బైక్​పైనే కుంపటి పెట్టి చలి కాచుకుంటున్న యువకులు

By

Published : Jan 21, 2023, 10:01 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

శీతాకాలంలో చలి గురించి చెప్పనవసరం లేదు. బయటకి వెళ్తే గడ్డకట్టుకుపోతామేమో అనేంతగా ఉంటుంది. మరి బైక్​పై వెళుతుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు కదా. దీనికి పరిష్కారంగా ఇద్దరు యువకులు బైక్​పై కుంపటి పెట్టి చలి కాచుకుంటున్నారు. ఇదేంటి వింతగా బైక్​పై ఎలా చలికి మంట కాచుకోవడం అనుకుంటున్నారా మరి అదే కదా విశేషం

బైక్​పై వెళుతున్నప్పుడు మంట కాచుకోవడం బహూశా ఎవరూ చూసి ఉండరు. మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత సంఘటన జరిగింది. ఇద్దరు యువకులు బైక్​పై సరదాగా బయటకు వెళ్లారు. తీవ్రంగా చలేయడం వల్ల వెనుక కూర్చున్న వ్యక్తి బైక్​ పైనే పొయ్యి పెట్టి నిప్పంటించాడు. అలా చలి కాచుకుంటూ బయట తిరిగారు. ఈ చలి కాచుకుంటున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ప్రయాణంలో చలి వేయకుండా ఇదో కొత్త మార్గం అంటున్నారు ప్రజలు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.