పొలంలోకి వెళ్లిన విశ్రాంత ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించిన ఏనుగు
Published on: Nov 19, 2022, 9:44 AM IST

తమిళనాడు కోయంబత్తూరులో ఓ ఏనుగు హల్చల్ చేసింది. పొలంలో ఉన్న విద్యుత్ కంచెను పరిశీలించేందుకు వెళ్లిన విశ్రాంత ఉపాధ్యాయుడు రామసామిపై దాడికి యత్నించింది. శుక్రవారం ఉదయం జరిగిందీ ఘటన. తమ గ్రామాన్ని ఏనుగుల గుంపు చుట్టుముట్టాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
Loading...