PRATHIDWANI ఆలయాల్లో విస్తుగోలిపే చర్యలు..దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు
Published on: Jan 21, 2023, 9:10 PM IST

ఒకచోట... డ్రోన్ దృశ్యాల కలకలం. మరొకచోట పాలకమండలి సభ్యురాలి ఆడియో టేపుల సంచలనం. తిరుమల, శ్రీశైలం దేవస్థానాల్లో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలే కాదు..కొంతకాలంగా తరచి చూస్తే... ఇలా భక్తుల్ని విస్తుబోయేలా చేస్తున్న పరిణామాలు ఎన్నో. వీటిల్లో సింహభాగం ఫిర్యాదులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవే. పాలకమండళ్ల ఇష్టానుసారం నిర్ణయాలు, అద్దెలు, రుసుముల పెంపు, భూములు, ఆస్తుల నిర్వహణపై విమర్శలు. భక్తుల మనోభావాలను కనీసం గౌరవించడం లేదని ఆవేదనలు. ఇలా ఎన్నో. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోని ఆలయాలు... అపచారాల పరిణామాలపై నేటి ప్రతిధ్వని.
Loading...