ఈతతో లాభాలెన్నో.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం!

author img

By

Published : May 13, 2022, 8:58 AM IST

swimming precautions

Swimming precautions: స్విమ్మింగ్​ అనేది అన్ని వయసుల వారికి మంచి వ్యాయామం. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్విమ్మింగ్​ అనేది మంచి మార్గం అని చెప్పాలి. స్విమ్మింగ్​ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం

swimming precautions: ప్రస్తుతం ఉన్న జీవన పరిస్థితుల నేపథ్యంలో అందరికీ శ్రద్ధ పెరిగింది. దీంతో చాలా మంది వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొదించుకుంటున్నారు. శారీరక దృఢత్వం కోసం జిమ్​లకు వెళుతూ పెద్ద పెద్ద బరువులు ఎత్తుతున్నారు. ఇలా వ్యాయామాలన్నింటిలోనూ చెమట చిందించాల్సిందే. మరి చెమటోడ్చడం ఇష్టం లేని వారి సంగంతేంటి! వారికి ఓ మార్గం ఉంది అదే స్విమ్మింగ్​. సరదాగా ఈత కొడుతూనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. శారీరక వ్యాయామం కోసం కిలోమీటర్లకుపైగా పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. వారానికి రెండు నుంచి మూడు గంటలు స్విమ్మింగ్ చేస్తే చాలు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు.

ప్రయోజనాలు:

  • ఊపిరితిత్తులు, గుండె దృఢంగా అవుతాయి
  • ఆక్సిజన్ కెపాసిటీ పెరుగుతుంది.
  • నడుము, మోకాలి నొప్పులు ఉన్న వారికి స్విమ్మింగ్​ మంచి పరిష్కారం
  • కండరాలు మరింత బలంగా అవుతాయి.

జాగ్రత్తలు:

  • చెవి ఇన్​ఫెక్షన్స్, స్కిన్​ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
  • స్విమ్మింగ్​ ఫూల్​లో నీరు నాణ్యతగా ఉందో లేదో చూసుకోవాలి.
  • ఈత కొట్టడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
  • డయాబెటిస్ ఉన్న వారు ఈత కొట్టడం వల్ల సులభంగా క్యాలరీలు తగ్గించుకోవచ్చు
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: చర్మంపై సెగ్గడ్డలతో బాధపడుతున్నారా? ఈ​ టిప్స్ మీకోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.