జీ-స్పాట్​ అంటే ఏంటి.. భావప్రాప్తిలో దాని పాత్రేంటి?

author img

By

Published : Sep 21, 2021, 7:01 AM IST

G-spot

శృంగారంలో జీ-స్పాట్​ అనేది ఎలా గుర్తించాలో చాలామందికి తెలియదు. అంతేకాదు మగవారిలో శీఘ్రస్కలనం జరిగితే భాగస్వామి తృప్తి చెందుతారా? లేదా అనేది కూడా అనుమానంగా ఉంటుంది. రతిలో పాల్గొనేటప్పుడు స్త్రీలకు ఎక్కడ పొత్తికడుపులో నొప్పి వస్తుందో? అనే భయం ఉండనే ఉంటుంది. దీనితో సరిగా సెక్స్​ చేయలేరు. శృంగార జీవితాన్ని అనుభవించలేకపోతుంటారు. మరి అలాంటి వారు ఏం చేయాలి? ఇరువురు సెక్స్​లో అవధులు లేని ఆనందాన్ని పొందాలి అంటే.. ఒకరిని ఒకరు ఎలా ప్రేరేపించుకోవాలి? వారి జీ స్పాట్​ను గుర్తించడం ఎలా? అనేది ఇప్పుడు చూద్దాం.

జీ-స్పాట్​ అనేది ప్రత్యేకంగా ఎక్కడో ఉండదు. స్త్రీ యోని మార్గంలో మూత్రనాళంకు చుట్టుపక్కల ఉంటుంది. పురుషుడు స్త్రీకి కామోద్రేకాన్ని తెప్పించినప్పుడు అక్కడ ఉండే కామనాడులు ప్రేరణ చెంది.. రక్తనాణాలు వ్యాకోచిస్తాయి. ఇలా వ్యాకోచం చెందిన చోటును పురుషాంగం తాకితే.. స్త్రీకి ఎక్కడలేని సుఖం కలుగుతుంది. చెప్పలేని మధురమైన అనుభూతిని మహిళలు పొందుతారు. దీనినే జీ-స్పాట్​ అంటారు.

శీఘ్రస్కలన సమస్య స్త్రీకి ఇబ్బందిగా మారుతుందా?

కచ్చితంగా మారుతుంది. దీనితో మహిళలు తృప్తి చెందలేకపోతారు. ఎక్కువసేపు రతిలో పాల్గొనాలి అనే మహిళలు ఈ సమస్య ఉన్నవారితో సుఖపడలేరు. అందుకే శీఘ్రస్కలనం జరిగే మగవారు ఈ జీ-స్పాట్​ను కనిపెట్టి శృంగారంలో పాల్గొనడం వల్ల భాగస్వామిని తృప్తి చెందేలా చేయగలరు. దీనికంటే ముందుగా వారు మగవారు స్త్రీలలో ప్రేరణ కలిగేలా చేయాలి. ఇందుకుగాను ఫోర్​ప్లే చేయాలి. స్టార్ట్ అండ్​ స్టాప్​ లాంటి పద్దతులను ఉపయోగిస్తే భాగస్వామికి ఇబ్బంది ఉండదు.

వర్జినీస్​మస్​ అంటే ఏంటి?

వర్జినీస్​మస్​ అంటే స్త్రీ జననాంగం మూసుకుపోవడం. అంటే శృంగారం చేసే సమయంలో పురుషాంగం స్త్రీ యోనిలో వెళ్లలేకపోవడాన్ని వర్జినీస్​మస్​ అని అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది.

  • ప్రైమరీ వర్జినీస్​మస్​
  • సెకండరీ వర్జినీస్​మస్​

ప్రైమరీ వర్జినీస్​మస్​

ప్రైమరీ వర్జినీస్​మస్​లో ప్రధానమైంది భయం. పురుషాంగం స్త్రీ జననాంగంలోకి పోతే తట్టుకోలేని బాధ ఉంటుంది అనే భయంతో ఏర్పడుతుంది. ఇలా ఉన్నవారు సెక్స్​ను కోరుకున్నా.. పురుషాంగం లోపలకి పోకపోవడం వల్ల అసంతృప్తికి లోనవుతారు. వీరికి కౌన్సిలింగ్​ అవసరం ఉంటుంది.

సెకండరీ వర్జినీస్​మస్​

సాధారణంగా స్త్రీలకు జరిగే యోని ఆపరేషన్​లలో కానీ, కాన్పుల సమయంలో కానీ పుండు ఏర్పడితే దాని గురించి వారు ఎక్కువగా ఆలోచిస్తారు. దీనినే సెకండరీ వర్జినీస్​మస్​ అంటారు.

పురుషుల వృషణాల్లో నొప్పి ఎందుకు వస్తుంది..

పురుషుల వృషణాల్లో ఏదైనా ఇన్​ఫెక్షన్​ ఉంటే నొప్పి వస్తుంది. సరైన రక్తప్రసరణ లేకపోయినా ఎక్కువ అవుతుంది. మరికొంతమందికి వేరుకోశం దెబ్బతింటే కూడా వస్తుంది. దీనికి సర్జరీ ఉంటుంది.

  1. స్త్రీల్లో బాధ లేకుండా జననాంగం దగ్గర తడి ఎక్కువ అవడం ఎందుకు జరుగుతుంది?
  2. మగవారికి కూడా వక్షోజాలు వస్తే ఏం చేయాలి?
  3. మగవారికి వీర్యం ఎక్కువగా రావాలంటే ఏం తినాలి?
  4. స్త్రీ జననాంగంలో త్వరగా తడారిపోతే ఏం చేయాలి?

పై ప్రశ్నలకు సమాధాలు తెలుసుకోవాలి అంటే కింద ఇచ్చిన ఈ వీడియో చూడండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: శీఘ్రస్కలన సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.