పిల్లల్లో గురక సమస్య నివారించడం ఎలా?

author img

By

Published : Sep 22, 2021, 7:14 AM IST

sleep apnea

చిన్న పిల్లలకు నిద్రలో ఒక్కోసారి శ్వాస పాక్షికంగా కానీ పూర్తిగా కానీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణం నిద్రలో శ్వాసనాళం ఇరుగ్గా తయారు కావడం లేదా అడ్డు తగలడం వల్ల అలా జరుగుతుంది. దీనినే స్లీప్​ ఆప్నియా (Sleep Apnea) అంటారు. పిల్లల్లో, పెద్దల్లో ఈ స్లీప్​ ఆప్నియాకు తేడా ఉంది. పెద్దవాళ్లలో ప్రధానంగా స్థూలకాయం కారణం అయితే పిల్లల్లో అడినాయిడ్స్​, టాన్సిల్స్​ పెరగడం లాంటివి కారణం కావచ్చు. త్వరగా దీనిని గుర్తించగలిగితే ఇబ్బందులను నివారించవచ్చు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల్లో కనపడే నిద్రాభంగపు శ్వాస సమస్య, ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాల గురించి తెలుసుకుందాం.

పిల్లలు నిద్రలో ఉన్నప్పుడు వారి శ్వాసకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చు. రకరకాల లక్షణాల ఆధారంగా ఈ సమస్యలను గుర్తించే వీలుంది. ప్రధానంగా సన్నటి గురక, ఊపిరి పీల్చడంలో కొద్దిపాటి విరామం, నిద్రాభంగం, పక్క తడపడం, దగ్గడం, నోటి ద్వారా గాలి పీల్చడం లాంటి లక్షణాలు కనిపిస్తే దానిని స్లీప్​ ఆప్నియాగా (Sleep Apnea) గుర్తించాలి. చిన్నపిల్లల్లో వచ్చే స్లీప్​ ఆప్నియా వలన పిల్లల ఎదుగుదల ప్రభావితం కావచ్చు. తొలిదశలోనే లక్షణాలను గుర్తించడం, వ్యాధి నిర్ధరణ, చికిత్స ప్రారంభించడం చాలా అవసరం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కారణాలు ఇవే..

  • ప్రధానంగా డౌన్ సిండ్రోమ్​ ఉన్న వాళ్లకు ఈ సమస్య ఎదురుకావచ్చు.
  • ముఖంలో కానీ, పుర్రెలో గానీ అసమానతలు, అసాధారణమైన మార్పులు ఉంటే స్లీప్​ ఆప్నియా వస్తుంది.
  • అధిక బరువు కూడా ఈ వ్యాధికి ఓ కారణం అవుతుంది.
  • టాన్సిల్స్​ ఉన్నవారిలో దీనిని ఎక్కువగా చూడవచ్చు.
  • సెరిబ్రల్​ పల్సీతో బాధపడుతున్నా, సికిల్​ సెల్​ వ్యాధి ఉన్నా, న్యూరో మస్క్యూలర్​ వ్యాధి ఉన్న వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
  • పుట్టుకతో తక్కువ బరువు ఉన్నా.. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు కూడా రావచ్చు.
  • జలుబు ఎక్కువగా చేసే వారికి కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు.
  • శరీరానికి సరైన ఫిజికల్​ యాక్టివిటీ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.

స్లీప్​ ఆప్నియాతో వచ్చే సమస్యలు..

  • ఈ వ్యాధి చాలా తీవ్రమైన ఇబ్బందులకు దారి తీస్తుంది. పిల్లల్లో ఎదుగుదల ఆగిపోవచ్చు.
  • గుండె సంబంధమైన వ్యాధులు రావచ్చు.
  • ఈ సమస్య ఉన్న పిల్లలు పగటి పూట చాలా డల్​గా ఉంటారు. దేని మీద ఎక్కువ దృష్టి పెట్టలేరు. నేర్చుకోవడంలో వెనకబడిపోతారు.
  • పెరగాల్సినంత బరువు పెరగరు. కొన్నిసార్లు హైపర్​ యాక్టివ్​గా తయారవుతారు.

నివారణ ఇలా..

  • స్లీప్ ఆప్నియాకు కారణమైన అంశాలను పరిణలోకి తీసుకొని వైద్యులు పరీక్షలు చేస్తారు.
  • టాన్సిల్స్​ ఉంటే వాటిని తొలగించడం.
  • శ్వాసకు ఇబ్బంది కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • కాలుష్యం కలిగించే దుమ్ము ధూళి ఇంట్లో లేకుండా చూసుకోవాలి.
  • పిల్లలు ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి.
  • ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలను ఇవ్వాలి.
  • బ్రీతింగ్​ ఎక్సర్​సైజ్​ నేర్పించాలి. ​

ఇదీ చూడండి: Egg Protein: గుడ్డు ప్రతి రోజూ తినొచ్చా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.