Calories In A Day: రోజుకు ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి?

author img

By

Published : Sep 24, 2021, 7:01 AM IST

Calories In A Day

శక్తి కావాలంటే తీసుకునే ఆహారంలో సరైన క్యాలరీలు ఉండాలి. ఆహారం నుంచి లభించిన క్యాలరీల వల్లే.. శరీరానికి శక్తి అంది జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అయితే రోజుకు ఎన్ని క్యాలరీలు (Calories In A Day) అవసరం? క్యాలరీలు ఎక్కువగా తీసుకుంటే ఏం అవుతుంది? ఎక్కువ అయిన క్యాలరీలను తగ్గించుకునేందుకు ఏం చేయాలి?

శరీరంలో జీవక్రియలు జరగాలన్నా.. బయట పనులు చేసుకోవాలన్నా.. మనకు శక్తి చాలా అవసరం. ఈ శక్తిని క్యాలరీల్లో కొలుస్తారు. ఆహారం ద్వారా లభించిన క్యాలరీలు (Calories In A Day) శరీర జీవక్రియలకు ఉపయోగపడుతాయి. ఈ జీవక్రియలకు ఖర్చు కాగా.. మిగిలినవి కొవ్వుగా మారుతాయి. దీనినే ఫ్యాట్​ అని పిలుస్తారు. ఒక్కొసారి కాలేయం, కండరాల్లో నిల్వ ఉన్న క్యాలరీలు అత్యవసర పరిస్థితుల్లో శక్తి విడుదలైనప్పుడు రక్తంలోకి విడుదల అవుతాయి. దీని వల్ల తక్షణం శక్తి లభిస్తుంది. మనిషి శరీరతత్వాన్ని బట్టి క్యాలరీలు అవసరమవుతాయి. సగటున ఒక మనిషికి రెండు వేల క్యాలరీల శక్తి అవసరం అవుతాయి. ఈ క్యాలరీలకు మించిన ఆహారం తీసుకుంటే.. వారిలో కొవ్వు పెరిగిపోయి స్థూలకాయం వస్తుంది. కాబట్టి తక్కువ క్యాలరీల ఉండే ఆహారాన్ని తీసుకొని వాటిని ఖర్చు చేసుకోవడం వలన బరువు అదుపులో ఉంటుంది.

పిండి పదార్థాలు, ఖనిజలవణాలు, ప్రోటీన్లు, కొవ్వుల ద్వారా శక్తి లభిస్తుంది. వీటిలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల ద్వారా మనకు ఎక్కువ క్యాలరీలు లభిస్తాయి. వీటి ద్వారా దాదాపు 60 శాతం క్యాలరీలు లభించే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రోటీన్లు నుంచి 20 శాతం, మిగతా 20 కొవ్వులు, ఇతర ఆహార పదార్థాల నుంచి పొందుతాం.

క్యాలరీలు ఎక్కువ అయితే బరువు పెరిగే అవకాశం ఉంది. మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మనం ఇంకా బరువు పెరిగుతాం. అయితే తగ్గాలి అనుకునే వారు వాటి మోతాదును తగ్గించాలి. దీని స్థానంలో ప్రోటీన్లు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి క్యాలరీలు తక్కువగా అందుతాయి. కడుపు నిండిన ఫీలింగ్​ ఉంటుంది. తక్కువ క్యాలరీలను సులభంగా ఖర్చు చేసుకోవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గర్భిణీలకు క్యాలరీలు అవసరం. ఎందుకంటే వారు ఇద్దరు సరిపడా ఆహారం తీసుకోవాలి. సాధారణంగా గర్భిణీలకు రెండో త్రైమాసికం నుంచి ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. వారు సాధారణం కంటే ఎక్కువగా.. 340 క్యాలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. మూడో నెలలో ఈ క్యాలరీలను 450 క్యాలరీల వరకు పెంచాల్సి ఉంటుంది. ఇందుకోసం మాంసకృతులు అధికంగా ఉండే తృణ, చిరు ధాన్యాలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికీ ఒక్కోవిధంగా క్యాలరీలు అవసరం అవుతాయి. ఇందుకోసం ఎవరి క్యాలరీలను వారు నిర్ధరించుకోవాలి. ఎత్తు, బరువు ఆధారంగా.. క్యాలరీలు నిర్ధరిస్తారు. దీనికి అనుగుణంగా ఎవరికి వారు డైట్​ పాటించవచ్చు. ఆహారం తీసుకునేటప్పుడే క్యాలరీలను దృష్టిలో ఉంచుకోవాలి. పాస్ట్​ ఫుడ్​, మార్కెట్​లో దొరికే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, ప్యాకేజీల్లో లభించే ఆహార పదార్థాల వల్ల శరీరంలో క్యాలరీలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. ఇంట్లో ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం ఉత్తమం.

  • మహిళలు రోజుకు 1600 నుంచి 2000 వరకు క్యాలరీలు తీసుకోవాలి.
  • మగవారిలో అయితే 2000 నుంచి 3000 వరకు క్యాలరీలు తీసుకోవాలి.

ఈ క్యాలరీలు అనేవి వ్యక్తి చేసే పనులను బట్టి కూడా మారుతాయి. కొన్నిసార్లు ఎక్కువ, తక్కువగా తీసుకోవచ్చు.

ఇదీ చూడండి: ఇది చేస్తే మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.