'నన్నే బహిష్కరిస్తారా.. రాజీనామాలు చేయండి'.. స్థానిక ప్రజాప్రతినిధులపై వైఎస్‌ కొండారెడ్డి ఒత్తిడి

author img

By

Published : May 13, 2022, 7:41 AM IST

YS Konda Reddy

YS Konda Reddy: వైయస్‌ఆర్‌ జిల్లా చక్రాయపేట మండల వైకాపా ఇన్‌ఛార్జి వైఎస్‌ కొండారెడ్డి మరో ఎత్తు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి తనను బహిష్కరించాలంటూ కలెక్టర్‌కు ఎస్పీ ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో.. నిరసనగా రాజీనామాలు చేయాలని మండలంలోని 16 మంది సర్పంచులు, 9 మంది ఎంపీటీసీ సభ్యులపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

YS Konda Reddy: చాగలమర్రి- రాయచోటి జాతీయ రహదారి పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ నుంచి డబ్బులు డిమాండు చేసిన అభియోగాలపై అరెస్టయి.. అనంతరం బెయిల్‌పై విడుదలైన వైయస్‌ఆర్‌ జిల్లా చక్రాయపేట మండల వైకాపా ఇన్‌ఛార్జి వైఎస్‌ కొండారెడ్డి మరో ఎత్తు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి తనను బహిష్కరించాలంటూ కలెక్టర్‌కు ఎస్పీ ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో.. నిరసనగా రాజీనామాలు చేయాలని మండలంలోని 16 మంది సర్పంచులు, 9 మంది ఎంపీటీసీ సభ్యులపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. వీరిలో నలుగురు స్పందించి కొండారెడ్డి పీఏ ఓబుల్‌రెడ్డి సారథ్యంలో గురువారం ఎంపీ అవినాష్‌రెడ్డి వద్దకు వెళ్లారు. జిల్లా బహిష్కరణ నిర్ణయంపై పునస్సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనని ఎంపీ స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు రాయచోటి జైలు నుంచి కడప చేరుకున్న కొండారెడ్డి గురువారం హైదరాబాద్‌కు పయనమైనట్లు సమాచారం.

అరెస్టు.. విడుదల: వైఎస్‌ఆర్‌ జిల్లా చక్రాయపేట మండలం వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన.. ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ గుత్తేదారులను బెదిరించారు. ఈ క్రమంలో పులివెందుల-రాయచోటి మార్గంలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. దీంతో గుత్తేదారులు చక్రాయపేటలో కొండారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కొండారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా ఆ తర్వాత బెయిల్ పై కొండారెడ్డి విడుదలయ్యారు. విడుదలైన ఆయనను జిల్లా నుంచి బహిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి: అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి... ఇదీ అక్కడి అన్నదాతల పరిస్థితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.