రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వాన బీభత్సం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Mar 17, 2023, 11:53 AM IST

Heavy rains in the state

Heavy rains in the state: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం దాటికీ రాత్రి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో విద్యుత్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ నియంత్రికలు దెబ్బతినడంతో.. విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖకు కూడా నష్టం వాటిల్లింది. రోడ్లపై నిలిచి ఉన్న మురుగునీటిని యంత్రాల ద్వారా తోడేస్తున్నారు. వర్షం మరో రెండు రోజులపాటు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వాన భీభత్సం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy rains in the state: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.. విపరీతమైన గాలులు మెరుపులతో ఉరుములతో వర్షాలు కొరవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈదురు గాలులకు రాష్ట్రంలోని పలుచోట్ల చెట్లు హోర్డింగ్లు నేలకొరిగాయి. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురుస్తూ ఉండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ములుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. కోర్టు రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

కడప.. అంబేద్కర్ కూడలి రోడ్డుపై భారీగా నీరు చేరడంతో నగరపాలక అధికారులు యుద్ధ ప్రాతిపదిక నీటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్​లోకి నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని మృత్యుంజయ కుంట, గంజికుంట కాలనీ, భరత్ నగర్, శ్రీకృష్ణదేవరాయ కాలనీ, అక్కయ్య పల్లి, శాస్త్రి నగర్, ఎస్ఆర్​నగర్, రామరాజు పల్లి, లోహియా నగర్, గౌస్ నగర్ తదితర ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం దాటికీ రాత్రి కడప నగరంలోని పలు ప్రాంతాలలో విద్యుత్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ నియంత్రికలు దెబ్బతినడంతో.. విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లాలో పలుచోట్ల మామిడికాయలు నేలకొరిగాయి. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖకు కూడా నష్టం వాటిల్లింది. రోడ్లపై నిలిచి ఉన్న మురుగునీటిని యంత్రాల ద్వారా తోడేస్తున్నారు. వర్షం మరో రెండు రోజులపాటు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో పిడుగు పాటు.. కురుపాం మండలంలోని గురువారం మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మండలంలోని బియ్యాలవలస సచివాలయం సమీపంలోని చెట్టుపై గురువారం సాయంత్రం పిడుగు పడింది. ఆ సమయంలో సచివాలయంలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పెద్ద శబ్దం రావడంతో సిబ్బంది ఒక్కసారిగా ఆందోళన చెంది బయటకు రాగ చెట్టుపై పిడుగు పడినట్లు గుర్తించారు. కొంచం పక్కనే పడితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని, దేవుడు దయతో ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఎన్టీఆర్ జిల్లా.. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లో తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. అరగంటసేపు భారీ శబ్దాలతో భయంకరంగా ఉరుములు ఉరిమాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మిర్చి కోతలు, గ్రేడింగ్ పనులు మమ్మురంగా జరుగుతున్నాయి. కోసిన మిర్చిని కల్లాల్లో ఆరబెట్టారు.. ఈ తరుణంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో కల్లాలు తడిసిపోయాయి. గురువారం రాత్రి వర్షం వస్తుందన్న నేపథ్యంలో రైతులు ఆరబెట్టిన మిర్చిని కాపాడుకునేందుకు.. తడవకుండా తార్బాలిన్ పట్టాలు కట్టారు. అయినా భారీగా కురిసిన వర్షాలకు కల్లాలన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట చేతికొచ్చే దశలో ఉన్న ఈ పైరు భారీ వర్షానికి పలుచోట్ల నేల వాలింది.

కృష్ణా జిల్లా.. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో తెల్లవారు జాము నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలంలో సుమారు 50 వేల ఎకరాల్లో మినుము పంట ఇప్పుడే.. కొత దశకు వచ్చింది.. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మినుము తరువాత నూర్పిడి చేయొచ్చు అని అనుకున్నారు. మినుము పొలాల్లో నూర్పిడి కాకుండా సుమారు 20 వేల ఎకరాల్లో వరి కుప్పలు ఉండి పోయాయి. మోపిదేవి మండలంలో సాగు చేస్తున్న టమోటా పంటకు ఈ వర్షాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

శ్రీసత్యసాయి జిల్లా.. కదిరి నియోజకవర్గంలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో దాదాపు గంటపాటు కదిరి, గాండ్లపెంట, తలుపుల ప్రాంతాల్లో కురిసింది. భారీ వాన ధాటికి వీధులు మడుగును తలపించాయి. పలుచోట్ల హోర్డింగులు, చెట్లు నేలకొరిగాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.