వైయస్సార్ జిల్లాలో కలకలం.. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ​అదృశ్యం

author img

By

Published : Mar 16, 2023, 11:00 AM IST

YSR district

YSR district: వైయస్సార్ జిల్లా పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్​గా పనిచేస్తున్న అచ్చన్న ఉన్నట్టుండి అదృశ్యం కావడం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. అచ్చన్న కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులో గత ఆరు మాసాల నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి అచ్చన్నకు మధ్య మనస్పర్ధలు ఉన్నాయని పేర్కొన్నారు.

YSR district: వైయస్సార్ జిల్లా పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్​గా పనిచేస్తున్న అచ్చన్న ఉన్నట్టుండి అదృశ్యం కావడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అచ్చన్న భార్య పిల్లలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడప ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అచ్చన్న కాల్ డేటా ఆధారంగా అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాకు చెందిన అచ్చన్న గత కొంతకాలం నుంచి కడప పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. కానీ అదే కార్యాలయంలో అచ్చన్నకు అక్కడ పని చేస్తున్న సిబ్బంది మధ్య గత ఆరు మాసాల నుంచి మనస్పర్ధలు ఉన్నాయి.

సిబ్బందికి, అచ్చన్న మధ్య ఉన్న మనస్పర్ధలు రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టికి పోవడంతో సంచలనంగా మారింది. నెల రోజుల క్రిందట సంబంధిత శాఖ డైరెక్టర్ వచ్చి కడపలో విచారణ కూడా చేపట్టారు. నివేదికను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం అచ్చన్న.. తను పని చేస్తున్న కార్యాలయానికి వెళ్లి తన సామగ్రిని కార్యాలయంలో ఉంచి చర్చికి వెళ్లాడు. అప్పటి నుంచి అతని చరవాణి స్విచ్ ఆఫ్ చేయబడింది. కర్నూలులో ఉంటున్న అచ్చన్న భార్య పిల్లలు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్​లో ఉండడంతో వారు హుటాహుటిన కడపకు వచ్చారు.

అచ్చన్న కడప కాగితాలపెంటలో ఓ గదిని అద్దెకు తీసుకొని అక్కడ ఉంటున్నాడు. ఆ గదికి వెళ్లి చూడగా అక్కడ అచ్చన్న కనిపించలేదు. కార్యాలయ సిబ్బందిని విచారించాక విధులకు హాజరు కాలేదని చెప్పారు. అక్కడ ఎక్కడా కూడా అచ్చన్న ఆచూకీ లభించకపోవడంతో.. అదే రోజు రాత్రి అచ్చన్న భార్య శోభారాణి పిల్లలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో గత ఆరు మాసాల నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి అచ్చన్నకు మధ్య మనస్పర్ధలు ఉన్నాయని.. ఒక దఫాలో అచ్చన్న ఒత్తిడికి లోనైనట్లు అతని భార్య, పిల్లలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ తండ్రి ఆచూకీ తెలపాలని వారు పోలీసులను కోరారు.

పోలీసులు అదృశ్య కేసుగా నమోదు చేసి అచ్చన్న ఉపయోగిస్తున్న చరవాణి కాల్ డేటాలను పరిశీలిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో అచ్చన్న ఆచూకీ కనుగొంటామని పోలీసులు భార్య, పిల్లలకు చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి గత నాలుగు రోజుల నుంచి కనిపించకపోవడంలో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు అచ్చన్న ఏమయ్యాడో తెలియక ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.