విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. సముద్ర స్నానం చేస్తూ ఇద్దరు విద్యార్థులు మృతి

author img

By

Published : Mar 6, 2023, 10:45 AM IST

Etv Bharat

Two Students Died : ఆదివారం కావడంతో వారందరూ సరదగా గడపాలని అనుకున్నారు. అదే విధంగా వారు ప్లాన్ చేసుకున్నారు. కానీ వారు అనుకోని విధంగా విషాదం నెలకొంది. ఇంజినీరింగ్‌ విద్యార్థుల బీచ్‌లో స్నానాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు విగత జీవులుగా మిగిలారు.

Bhimavaram Institute of Engineering Technology College Students : విద్యార్థులు వారం రోజులు పుస్తకాలతో కుస్తి పడతారు. అందరూ ఆదివారం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఆ రోజు రానే వచ్చింది. స్నేహితులతో సరదాగా, ఉల్లాసంగా గడపాలని ఊహించుకుంటారు. వాళ్లు కూడా అదే విధంగా ప్లాన్ చేసుకున్నారు. స్నేహితులందరూ సినిమా చూసి బీచ్​కు వెళ్లి స్నానాలు చేసుకుందామనుకున్నారు. కానీ వారందరూ ఇటువంటి విషాదం జరుగతుందని అసలు అనుకోలేదు. విహారం కోసం సముద్ర తీరానికి వెళ్లిన విద్యార్థులకు విషాదం మిగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్‌ బీచ్‌లో ఆదివారం సముద్రంలో స్నానం చేస్తూ గల్లంతు అయిన ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల మృత దేహాలు రాత్రికి ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.

అలల తీవ్రత.. ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతు : ఇద్దరు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ప్రకారం ఆదివారం సెలవు రోజు కావడంతో పాల కోడేరు మండలం పెన్నాడలోని (బైట్‌) భీమవరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ కళాశాలకు చెందిన 11 మంది ఈసీఈ విద్యార్థులు భీమవరం వెళ్లికి వెళ్లారు. అక్కడ సినిమా చూసి తిరుగు ప్రయాణం చేశారు. అనుకున్న విధంగా కాలేజీకి పోతు పోతు బీచ్​కు వెళ్లాలనుకున్నారు. అనంతరం రైలులో నరసాపురం చేరుకున్నారు. తరువాత ఆటోలో బీచ్‌కు ఆనందంతో వెళ్లారు. పాండురంగ స్వామి దేవాలయ సమీపంలో సముద్రంలో స్నానాలు చేయాలని ఇష్టపడ్డారు. అదే విధంగా స్నానాలు చేయడానికి సముద్రంలోకి వెళ్లారు. అలల తీవ్రత ఎక్కువగా కావడంతో విజయనగరానికి చెందిన ఇంజనీరింగ్ ఈసీఈ విభాగం రెండో ఏడాది చదువుతున్న కందుకూరి లోహిత్‌ మణికంఠ (19), ఇదే కళాశాలలో ఇంజనీరింగ్ ఈసీఈ విభాగం మొదటి ఏడాది చదువుతున్న తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన కొమ్మినేని లిఖిత్‌కుమార్‌ (18) గల్లంతయ్యారు.

విగత జీవులుగా విద్యార్థులు.. కన్నీటీ పర్యంతమైన కుటుంబ సభ్యులు : తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వారి అందించిన సమాచారంతో ఘటనకు సంబంధించి వీఆర్వో నారిన వెంకన్న బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్​ఐ రాజేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాని వారి విహారం విషాదం మిగిల్చింది. మొదటగా లోహిత్ మణికంఠ మృత దేహం లభ్యమైంది. కొమ్మినేని లిఖిత్‌ కుమార్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ దురదృష్టవశాత్తు కొమ్మినేని లిఖిత్‌ కుమార్‌ విగత జీవిగా కనిపించాడు. ఇద్దరి కుటుంబ సభ్యులు కన్నీటీ పర్యంతం అయ్యారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.