MP RRR: నాడు రాళ్లు వేస్తే పారిపోయారు.. జగన్​పై ఎంపీ రఘురామ వ్యంగ్యాస్త్రాలు​

author img

By

Published : Jan 15, 2022, 8:35 PM IST

mp raghu ramakrishna raju

సీఎం జగన్ పై ఎంపీ రఘురామ విమర్శల వర్షం కురిపించారు. సీఎం జగన్​కు డబ్బు జబ్బు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో సున్నా వడ్డీకి సున్నం పెట్టి.. పావలా వడ్డీకి పాడె కట్టి.. రైతు భరోసా కేంద్రాలును నిరాశా కేంద్రాలుగా మార్చారని ధ్వజమెత్తారు.

mp raghu ramakrishna raju fires on jagan: సీఎం జగన్​కు డబ్బు జబ్బు చేసిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణలో యాత్ర చేసిన జగన్.. కొంత మంది రాళ్లు వేస్తే పారిపోయారని ఎద్దేవా చేశారు. భయపడి చెల్లితో పాదయాత్ర చేయించారని.. అరెస్ట్ భయంతో వంద రోజులపాటు ఒకే ప్రాంతంలో పాదయాత్ర చేసిన యోధుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాష్ట్రంలో సున్నా వడ్డీకి సున్నం పెట్టి.. పావలా వడ్డీకి పాడె కట్టి.. రైతు భరోసా కేంద్రాలను.. రైతు నిరాశా కేంద్రాలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతులను జైల్లో పెడుతూ.. రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని సొంత పత్రికల్లో ప్రకటనలు, వార్తలు రాయించుకుంటున్నారని రఘురామ విమర్శించారు. రాజన్న రాజ్యంలో దాడులు.. హత్యలు పరాకాష్టకు చేరుకున్నాయని.. బీపీ పెరిగితే దాడులు, భయపడితే హత్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

గుంటూరు జిల్లాల్లో జరిగిన తెదేపా నేత హత్య కేసులో.. ఎస్పీ విశాల్‌ గున్నీ.. ఊసరవెల్లి సినిమా తరహాలో కథను చెబుతున్నారని మండిపడ్డారు. తనను హతమార్చేందుకు సీఐడీ చీఫ్ చేస్తున్న ప్రయత్నాలు, ముఖ్యమంత్రి, సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర గురించి ప్రధానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 10 కిలోమీటర్ల దూరం రోడ్డు వేయలేక.. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో ప్రయాణించారని ఆక్షేపించారు. సంక్రాంతి పండగ నుంచి.. చాలా అవాంతరాలు తొలగాలని భగవంతుని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.


ఇదీ చదవండి :

విరాట్​ కోహ్లీ సంచలన నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.