కుప్పంలోనూ ఓడిపోతాననే భయం చంద్రబాబుకు పట్టుకుంది: సీఎం జగన్​

author img

By

Published : Nov 21, 2022, 2:48 PM IST

Updated : Nov 22, 2022, 5:21 PM IST

CM JAGAN IN NARASAPURAM

CM JAGAN FOUNDATIONS FOR SOME DEVELOPMENT WORKS: తమిళనాడు, కేరళ తర్వాత దేశంలోనే నరసాపురం ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం మూడోదని సీఎం జగన్​ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కర్నూలు పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్​ మండిపడ్డారు. కుప్పంలోనూ ఓడిపోతాననే భయం చంద్రబాబుకు పట్టుకుందని ఎద్దేవా చేశారు.

సీఎం జగన్​

CM JAGAN IN NARASAPURAM : అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్​ శ్రీకారం చుట్టారు. నరసాపురంలో ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్​ తెలిపారు. తమిళనాడు, కేరళలోనే ఫిషరీస్‌ వర్సిటీలు ఉన్నాయన్న సీఎం.. దేశంలో మూడో ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఇదేనని వ్యాఖ్యానించారు.

ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే మొదటి స్థానం: రూ.332 కోట్లతో ఫిషరీస్‌ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నామని.. ఫిషరీస్‌ వర్సిటీకి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రూ.430 కోట్లతో బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. ఆక్వా కల్చర్‌ సుస్థిర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న జగన్​.. మానవ వనరుల కొరత తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు.

ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం అనేది ఇక్కడి ప్రజల కల అని జగన్‌ పేర్కొన్నారు. ఫిషరీస్‌ వర్సిటీ ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వ్యాఖ్యానించారు. ఉప్పుటేరుపై మూలపర్రు రెగ్యులేటర్‌ నిర్మిస్తున్నామన్నారు. కొల్లేరులో ఐదో కాంటూరు వరకు మంచినీరు ఉండేలా రెగ్యులేటర్ నిర్మాణం జరుగుతుందని.. నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రి రూపురేఖలు మారుస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

"ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం అనేది ఇక్కడి ప్రజల కల. ఫిషరీస్‌ వర్సిటీ ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆక్వా రంగంలో మానవ వనరుల కొరత తీర్చేందుకు వర్సిటీ ఏర్పాటు చేశాం. ఉప్పుటేరుపై మూలపర్రు రెగ్యులేటర్‌ నిర్మిస్తున్నాం. కొల్లేరులో ఐదో కాంటూరు వరకు మంచినీరు ఉండేలా రెగ్యులేటర్. నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రి రూపురేఖలు మారుస్తాం. తమిళనాడు, కేరళలోనే ఫిషరీస్‌ వర్సిటీలు ఉన్నాయి. దేశంలో మూడో ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఇదే"-చంద్రబాబు

టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ : కర్నూలు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్​ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కుప్పానికి కూడా ఏమీ చేయలేదన్న సీఎం.. స్థానిక ఎన్నికల్లో కుప్పంలో తెదేపాను చిత్తుగా ఓడించామని తెలిపారు. కుప్పం ప్రజలు కూడా బాయ్ బాయ్ బాబూ.. అన్నారని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు కూడా ఇదేం ఖర్మరా బాబూ అంటున్నారని విమర్శించారు. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అన్న సీఎం.. దత్తపుత్రుడి పార్టీని కూడా రౌడీసేనగా మార్చారని విమర్శించారు.

ఇదేం ఖర్మరా బాబూ: తెదేపా పాలన చూసి ఇదేం ఖర్మరా బాబూ అని జనం అన్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలు రాజకీయాల్లో ఉండటం ఇదేం ఖర్మరా బాబూ అని సీఎం వ్యాఖ్యానించారు. ఇవే తన చివరి ఎన్నికలని ప్రజలను చంద్రబాబు బెదిరిస్తున్నారని.. కుప్పంలోనూ ఓడిపోతాననే భయం చంద్రబాబుకు పట్టుకుందని జగన్​ ఎద్దేవా చేశారు. మంచి పనులు చేయనివారికి ప్రజలు ఎందుకు ఓటేస్తారు అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 22, 2022, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.