Camp politics at Achanta: ఆచంటలో వేడెక్కిన రాజకీయం.. ఎంపీపీ కోసం క్యాంపు రాజకీయాలు

author img

By

Published : Sep 21, 2021, 10:26 AM IST

Updated : Sep 21, 2021, 5:33 PM IST

Camp politics Begin at achanta

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఎంపీపీ ఎన్నిక కోసం క్యాంపు రాజకీయాలు(Camp politics Begin at achanta) జోరందుకున్నాయి. 6 ఎంపీటీసీ స్థానాలు గెలిచిన వైకాపా.. ఎంపీపీ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో తెదేపా, జనసేన నేతలు అప్రమత్తమయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఎంపీపీ కోసం క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. తెలుగుదేశం ఏడు, జనసేన నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. అధికార వైకాపా అభ్యర్థులు 6స్థానాల్లో గెలుపొందారు. ఎంపీపీ పదవి దక్కాలంటే 9 మంది ఎంపీటీసీలు కావాలి. కేవలం ఆరు స్థానాల్లో విజయం సాధించిన వైకాపా ఎంపీపీ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో...తెలుగుదేశం, జనసేన నేతలు అప్రమత్తమయ్యారు. మరోపక్క గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సొంత నియోజకవర్గ కేంద్రం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మండల పరిషత్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవాలని తెదేపా, జనసేనలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.

ప్రస్తుతం ఎంపీపీ పదవి కోసం తెలుగుదేశం, జనసేన నేతల మధ్య చర్యలు జరుగుతున్నాయి. తెదేపా నేత మాజీమంత్రి పితాని సత్యనారాయణ క్యాంపులో ఏడుగురు ఎంపీటీసీలు ఉన్నారు. జనసేన నేత సూర్యనారాయణ క్యాంపులో నలుగురు జనసేన ఎంపీటీసీలు ఉన్నారు. అధ్యక్ష స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో తెదేపా నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరు మాత్రమే గెలుపొందారు. ఇరువురు అభ్యర్థులు ఎంపీపీ పదవి కోసం గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ చదవండి..

cm jagan on parishad results: 'ఈ అఖండ విజయం..మా బాధ్యతను పెంచింది'

Last Updated :Sep 21, 2021, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.