‘జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు’ .. రేపు విజయనగరంలో పవన్ పర్యటన

‘జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు’ .. రేపు విజయనగరంలో పవన్ పర్యటన
Jagananna colonies : జగనన్న కాలనీల నిర్మాణాల్లో నెలకొన్న జాప్యం,లబ్ధిదారుల అవస్థలు, చోటుచేసుకుంటున్న అక్రమాలపై.. జనసేన తలపెట్టిన ‘జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమం రేపు విజయనగరంలో ప్రారంభం కానుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు విజయనగరంలో పర్యటించి.. లబ్దిదారులను పరామర్శించనున్నారు.
Jagananna colonies: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయనగరంలో పర్యటించనున్నారు. జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్...రేపు విజయనగరం మండలం గుంకలాంలోని జగనన్న కాలనీలోని గృహాలను పరిశీలిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయి. పథకం అమలు తీరును లబ్ధిదారులతో మాట్లాడి పవన్ తెలుసుకోనున్నట్లు... జనసేనపార్టీ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నకాలనీల్లో మూడు రోజుల పాటు జనసేన పార్టీ శ్రేణులు పర్యటించనున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో జగనన్నమోసం హ్యాష్ ట్యాగ్ ద్వారా... గృహనిర్మాణ స్థితిగతులను పార్టీ పోస్ట్ చేయనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.
ఇవీ చదవండి:
