Chandrababu tour in Uttarandhra: 17 నుంచి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన.. భారీ ఏర్పాట్లు
Published: May 16, 2023, 7:38 PM


Chandrababu tour in Uttarandhra: 17 నుంచి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన.. భారీ ఏర్పాట్లు
Published: May 16, 2023, 7:38 PM
Chandrababu Naidu tour in Uttarandhra : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో పర్యటన ఖరారు కాగా, అధినేత సభలు, సమావేశాలను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 17న పెందుర్తి, 18న ఎస్.కోట, 19న అనకాపల్లిలో పర్యటన ఉంటుందని నాయకులు వెల్లడించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
Chandrababu Naidu tour in Uttarandhra: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18న విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు విజయనగరం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిమిడి నాగార్జునతో పాటు ఎస్.కోట ఇంఛార్జ్ కోళ్ల లలితకుమారి చంద్రబాబు పర్యటన వివరాలు తెలియచేశారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారని చెప్పారు.
పర్యటనలో భాగంగా 17విశాఖ జిల్లా పెందుర్తి, 18న విజయనగరం జిల్లా శృంగవరపుకోట, 19న అనకాపల్లి జిల్లా కేంద్రంలో చంద్రబాబు పర్యటించనున్నారు. పెందుర్తి పర్యటన అనంతరం 18న మధ్యాహ్నం 3.30గంటలకు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం పర్యటనకు రానున్నారు. సాయంత్రం ఎస్.కోటలో శిరికి రిసార్ట్ కు చేరుకుని భీమసింగి చెరకు రైతుల నుంచి వినతిపత్రం స్వీకరిస్తారని ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలితకుమారి తెలిపారు. అక్కడి నుంచి బయలుదేరి ఎస్.కోట లోని పుణ్యగిరి, శ్రీవివేకానంద కళాశాల మీదుగా దేవీగుడి కూడలి వరకు రోడో షో నిర్వహిస్తారు. అనంతరం దేవీగుడి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 6నుంచి 7.30గంటల వరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారని ఆమె తెలిపారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత శిరికి రిసార్ట్ లోనే చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు. మరుసటి రోజు శుక్రవారం కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థుల నుంచి చంద్రబాబు వినతిపత్రం స్వీకరిస్తారు. అనంతరం స్థానిక నాయకులతో వివిధ అంశాలపై సమీక్షించనున్నారు. ఎస్.కోట పర్యటనలో చివరిగా దాసరి సామాజిక వర్గంతో టీడీపీ అధినేత సమావేశం కానున్నారు. దాసరి సామాజిక వర్గంతో సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు శృంగవరపుకోటలోని శిరికి రిసార్ట్స్ నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో అనకాపల్లి నియోజకవర్గ పర్యటనకు బయల్దేరనున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నారు. 17, 18 ,19న జిల్లాల్లో పర్యటించనున్నారు. 17న పెందుర్తి, 18న ఎస్.కోట, 19న అనకాపల్లి వస్తున్నారు. 18న ఎస్.కోటలో జరిగే కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలి. ఇంతకు ముందు రాజాం, బొబ్బిలి, విజయనగరంలో సభలు పెద్ద ఎత్తున విజయవంతం చేశాం. జీఓ నంబర్ 1ను హైకోర్టు కొట్టి వేసిన తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. - కిమిడి నాగార్జున, విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడుకి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎస్. కోట సభ కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. అశోక గజపతి రాజు సహకారంతో గతంలో ఏర్పాటు చేసిన గిరిజన యూనివర్సిటీని ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దానిపై విద్యార్థులు వినతి పత్రాలు అందజేయనున్నారు. - కోళ్ల లలిత కుమారి, శృంగవరపుకోట టీడీపీ బాధ్యురాలు
ఇవీ చదవండి :
