ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక సందర్శన..పాఠశాలల్లో బయటపడ్డ లోపాలు

author img

By

Published : Jan 20, 2023, 9:38 PM IST

Education Principal Secretary Praveen Prakash

Education Principal Secretary Praveen Prakash: విజయనగరం జిల్లాలో విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పలు పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పలు పాఠశాలలను సందర్శించి బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయని కారణంగా ఓ ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు.

Education Principal Secretary Praveen Prakash: విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో పలు పాఠశాలలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా సందర్శించారు. నిర్వహణలో డొల్లతనం బయటపడడంతో పలువురికి చార్జిమెమోలు, సస్పెన్షన్లు జారీచేశారు. బొబ్బిలి పట్టణంలోని నరేంద్ర దేవి పాఠశాలను సందర్శించి.. బోధన తీరును తెలుసుకున్నారు. పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన వివరాలను ఆన్​లైన్​ పోర్టర్లు నమోదు చేయకపోవడం పట్ల ఉపాధ్యాయుడు​ని సస్పెండ్ చేశారు. కొంతమంది విద్యార్థులు నేలపై కూర్చోవడం పట్ల బెంచీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత ఆర్డీవో నిర్మల కుమారి, సర్వశిక్షా అభియాన్ ఏపీసీ అప్పలనాయుడులకు మెమోలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పిరిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. జనవరి నెల ముగుస్తున్నా ఇంకా సిలబస్ పూర్తి చేయకపోవడం పట్ల సంబంధిత ప్రధానోపాధ్యాయురాలుపై మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం పట్ల ఇలా జరిగిందంటూ డీఈఓ, డిప్యూటీ డీఈఓలకు మెమోలిస్తున్నట్లు హెచ్చరించారు. పాఠశాలలో శుద్ధ జల ప్లాంట్ సంబంధిత ఇంజనీర్ వర్గాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

డీఈలకు మెమోలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం రామభద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యాశాఖ సంబంధించిన కొన్ని యాప్​లను డౌన్​లోడ్​ చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే పిల్లలకు ఎలా పాఠాలు చెప్పగలరని ప్రశ్నించారు. ప్రవీణ్ ప్రకాష్ పర్యటన జిల్లా విద్యాశాఖ అధికారులకు గుబులు రేపింది. ఆయన పర్యటనలో పలు లోపాలు బయటపడడంతో అందరూ నివ్వెరపోతున్నారు.‍

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.