విశాఖ జిల్లా నక్కపల్లి మండలం పాటిమీద గ్రామంలో పెట్రో కారిడార్ కోసం భూసేకరణ కు వెళ్లిన రెవెన్యూ అధికారులను సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు అడ్డుకున్నారు. గతంలో భూసేకరణ చేపట్టిన భూములకు ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయి పరిహారం అందించలేదని వాపోయారు. సాగులో ఉన్న ప్రతి భూమికి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారుల అడ్డగింతతో గ్రామంలో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది.
ఇవీ చదవండి: