మన్యం చదువులు ‘గాలికి’!

author img

By

Published : Sep 27, 2021, 8:04 AM IST

manyam schools

అక్షరాలు నేర్చుకొవాలంటే ఆమడ దూరం గుట్టపై ఉన్న ఈ పూరిపాకే దిక్కు ఆ గిరిబిడ్డలకు. ఈదురుగాలులకు చెదిరిన ఆ కప్పుకిందే ఎండా, వానలకు తట్టుకొని విద్యను అభ్యషిస్తున్నారు.

విశాఖ మన్యం చింతపల్లి మండలంలోని కిటుమల పంచాయతీ పులిగొంది ఎంపీపీ పాఠశాల ఇది. లక్కవరం, పులిగొంది గ్రామాలకు చెందిన సుమారు 60 మంది గిరిజన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. మూడు కొండలు దాటితే ఇక్కడికి చేరుకోగలం. అలాగని రోడ్డు మార్గమేం లేదు. గుట్టలపై నుంచి పడుతూ లేస్తూ వెళ్లాల్సిందే. ఇటీవలి వర్షాలు, ఈదురుగాలులకు పాఠశాల పైకప్పు పెంకులూ ఎగిరిపోయాయి. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులు వర్షానికి తడుస్తూ, ఎండలో ఇబ్బంది పడుతూ అందులోనే చదువులు కానిచ్చేస్తున్నారు. పాఠశాల భవన నిర్మాణానికి పంచాయతీ నుంచి కొంత నిధులు కేటాయిస్తానని, నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని సర్పంచి రమణమ్మ కోరుతున్నారు. ‘నాడు-నేడు’ మొదటి విడత పనుల్లో ఈ బడి లేదు. బడి భవనం కోసం అక్టోబరులో ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు తెలిపారని స్థానికులు వెల్లడించారు.

ఇదీ చదవండీ.. విద్యార్థుల గుండె గు'బిల్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.