తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్: తితిదే ఈఓ ధర్మారెడ్డి

తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్: తితిదే ఈఓ ధర్మారెడ్డి
Anti Drone System In Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా వివాదం తీవ్ర కలకలం సృష్టించడంతో, టీటీడీ అప్రమత్తమైంది. దీంతో తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార్లు వెల్లడించారు. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి వీల్లేని విధంగా చర్యలు తీసుకోనున్నట్లు అధికార్లు ప్రకటించారు.
Anti Drone System In Tirumala : తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుక వస్తున్నామని తితిదే ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమేరాతో దృశ్యాల చిత్రీకరణపై ఆయన స్పందించారు. డంపింగ్ యార్డ్ నుంచి అన్నదానం కాంప్లెక్స్ వరకు సర్వే చేయడానికి ఐఓసీకి అనుమతిచ్చామని ఆయన తెలిపారు. ఐఓసీ సిబ్బంది అత్యుత్సాహంతో ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించారా అనే దానిపై విచారిస్తున్నామని అన్నారు. కాగా యూట్యూబ్ లో ఉన్న వీడియోను తొలగించామని ఆయన తెలిపారు.
పర్మిషన్ ఇచ్చింది వాస్తవం..! అది అన్నదానం నుంచి గార్బేజ్ సెంటర్ వరకు.. ఐఓసీఎల్ గవర్నమెంట్ ఏజెన్సీ డ్రోన్ తో సర్వే చేసుకుని వాళ్లు కారిడార్ ఏర్పాటు చేసుకుంటాం అని అడిగితే అధికారికంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోని కూడా మనం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించి అదెలా చేశారనేది కనుక్కుంటాం. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరు చేసింది కాదు. ఎవరైనా అత్యుత్సాహంతో చేశారా.. దానిపైన ఎలా నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎవరైనా కావాలని చేసినా..అత్యుత్సాహంతో చేసినా తప్పు తప్పే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏమాత్రం ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య తీసుకుంటాం. తర్వాత యూట్యూబ్లో ఉన్న వీడియోలను కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశాం అదే విధంగా వాటిని తొలగించడం జరిగింది. భద్రతా విషయంలో ఎక్కడ కూడ రాజీ లేదని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. -ధర్మారెడ్డి, తి.తి.దే ఈవో
తితిదే ఈఓ ధర్మారెడ్డి
ఇవీ చదవండి:
