బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఆహ్లాదకరంగా నూతన పార్కులు

author img

By

Published : Sep 23, 2022, 1:04 PM IST

NEW PARK AT TIRUMALA

NEW PARK AT TIRUMALA : బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు పార్కులు అభివృద్ధి చేస్తున్నామని తితిదే ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి అన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద అభివృద్ధి చేసిన పార్కును ఆయన ప్రారంభించారు. దాతల సాయంతో సుమారు రూ.70లక్షలు వెచ్చించి ఈ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశామన్నారు.

TTD CHAIRMAN SUBBA REDDY: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా తిరుమలలో ఉన్న అన్ని ఉద్యానవనాలకు కొత్త శోభను తీసుకురానున్నట్లు చెప్పారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వద్ద అభివృద్ధి చేసిన పార్కును ఆయన ప్రారంభించారు. దాతల సాయంతో సుమారు రూ.70లక్షలు వెచ్చించి ఈ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశామన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పారు. తిరుమలలో అందుబాటులోకి తీసుకొచ్చిన నూతన పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు. తిరుపతిలో శ్రీనివాస సేతు(గరుడ వారధి) నిర్మాణ పనులు ఏడాది ఆఖరి కల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. 2023 కొత్త ఏడాది నాటికి వారధి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. శ్రీనివాస సేతుతో తిరుపతి స్థానికులకు, భక్తులకు ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయన్నారు.

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు.. ఆహ్లాదకరంగా నూతన పార్కులు: తితిదే ఛైర్మన్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.