కాబోయే అర్ధాంగితో.. తిరుమల సన్నిధిలో అనంత్ అంబానీ
Updated on: Jan 26, 2023, 11:05 AM IST

కాబోయే అర్ధాంగితో.. తిరుమల సన్నిధిలో అనంత్ అంబానీ
Updated on: Jan 26, 2023, 11:05 AM IST
Anant Ambani visits Tirumala : ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. తనకు కాబోయే భార్యతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. కొద్దిరోజుల క్రితం వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
Anant Ambani visits Tirumala : తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తనకు కాబోయే అర్ధాంగితో కలిసి ఆయన స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఇటీవలె రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీల రెండో తనయుడు అనంత్ అంబానీకి, విరెన్ మర్చంట్, శైల దంపతుల కుమార్తె రాధికా మర్చంట్‌కు అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ముంబయిలోని అంబానీల నివాసమైన ఆంటిలియాలో నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. గుజరాతీ, హిందూ కుటుంబ సంప్రదాయాలను అడుగడుగునా పాటించారు.
ఇవీ చదవండి:
