Anganwadi: అంగన్​వాడీ సరుకులు పక్కదారి..!

author img

By

Published : Oct 13, 2021, 10:42 AM IST

villagers intercepted illegal sale of anganwadi goods

చిన్నారులకు చేరాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతూనే ఉంది. అంగన్​వాడీ కేంద్రాల నుంచి వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అంగన్​వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడటంతో.. చిన్నారులకు చేరాల్సిన పౌష్టికాహారం వ్యాపారులకు చేరుతోంది.

అంగన్​వాడీ సరుకులు పక్కదారి

అంగన్​వాడీ కేంద్రాల(anganwadi centres)లో పంచే పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నదుకూరు గ్రామంలో.. మంగళవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న అంగన్​వాడీ కేంద్రాల సరుకులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఓ వ్యాపారి.. గుడ్లు, కందిపప్పు తరలిస్తున్నారని గ్రామస్థులు గుర్తించి నిలదీశారు. అంగన్​వాడీ కేంద్రం నుంచి వీటిని తరలిస్తున్నట్లు వ్యాపారి ఒప్పుకున్నాడు. జులై నెలలో పామిడి మండలంలోని బత్తిలి వద్ద అక్రమంగా తరలిస్తున్న పాల ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు కార్యకర్తలను విధుల నుంచి తొలగించినా.. అక్రమాలు మాత్రం ఆగడం లేదు.

ఇదీ చదవండి: ఏపీఎస్‌ఎఫ్‌సీ వ్యవహారాలపై త్వరలో ఆర్‌బీఐ భేటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.