మిస్ యూనివర్స్ సింగపూర్‌గా తెలుగు యువతి నందిత

author img

By

Published : Sep 17, 2021, 10:17 PM IST

Updated : Sep 18, 2021, 1:20 AM IST

మిస్ యూనివర్స్ సింగపూర్‌గా తెలుగు యువతి నందిత

22:14 September 17

నందిత తల్లిదండ్రుల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా

    మిస్ యూనివర్స్ సింగపూర్ -2021 టైటిల్ దక్కించుకున్న బాన్న నందిత స్వస్ధలం శ్రీకాకుళం. తండ్రి బాన్న గోవర్ధనరావు, తల్లి ఫణి మాధురి. వీరు 25 ఏళ్ల క్రితమే సింగపూర్ వెళ్ళి అక్కడే స్ధిరపడ్డారు. తండ్రి గోవర్ధనరావు సింగపూర్​లోని ఏవియేషన్ సప్లయ్ చెయిన్ సీనియర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు.  తల్లి మాధురి సివిల్ ఇంజినీర్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలర్ గా పని చేస్తున్నారు.  సోదరుడు హర్ష సౌరవ్... కెనడా వాంకోవర్​లోని యూనివర్సిటీ అఫ్ బ్రిటిష్ కొలంబియాలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అభ్యసిస్తున్నారు. వివిధ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనే నందిత... సింగపూర్​లో ప్రతిష్టాత్మకమైన రాఫెల్ ఇన్​స్టిట్యూట్​లో పాఠశాల విద్య, మాధ్యమిక విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం మేనేజ్​మెంట్, కంప్యూటర్స్​లో డ్యూయెల్ డిగ్రీ చదువుతున్నారు.  

  మిస్ యూనివర్స్  సింగపూర్ -2021 గా కిరీటాన్ని దక్కించుకోవడం ఎంతో అనందంగా ఉందని, డిసెంబర్​లో ఇజ్రాయిల్​లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకూ హాజరవుతానని నందిత తెలిపారు. చదువులో అగ్రస్ధానంలో ఉంటూనే, ఇష్టమైన రంగంలోనూ సాధన చేస్తూ... టైటిల్ గెలవడంపై తల్లిదండ్రులు గోవర్దన్, మాధురిలు అనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీ చదవండి: ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి స్వల్ప అస్వస్థత

Last Updated :Sep 18, 2021, 1:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.