ACB : రూ.4లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన టెక్కలి తహశీల్దార్

author img

By

Published : Sep 24, 2021, 10:03 PM IST

Updated : Sep 24, 2021, 11:44 PM IST

Mro Bribe

22:01 September 24

రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నాగభూషణరావు

శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి తహసీల్దార్ నాగభూషణరావు అనిశా వలకు చిక్కారు. గూడెం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, వైకాపా నేత గుజ్జు వెంకటరెడ్డి ఫిర్యాదుతో అనిశా రంగంలోకి దిగింది. డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో పక్కా వ్యూహంతో తహసీల్దార్ అద్దెకు ఉంటున్న
నివాసంలో రాత్రివేళ మాటువేసి పట్టుకున్నారు. బాధితుడు వెంకట రెడ్డికి టెక్కలి చిన్నబజారు కూడలిలో ఉన్న దుకాణ సముదాయం కూల్చివేసేందుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని.. తహసీల్దార్ గత కొన్నిరోజులుగా బెదిరిస్తూ వచ్చారు. రూ.5 లక్షలు
ఇవ్వకుంటే కూల్చేస్తానని భయభ్రాంతులకు గురిచేశారు. 

దీంతో బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించారు. భవనం కూల్చకుండా ఉండేందుకు, పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం అనిశా బృందం లంచాధికారిని పట్టుకున్నారు. తహసీల్దార్ నివాసంలో సోదాలు చేయగా, అదనంగా మరో రూ.1.15 లక్షలు లభించినట్లు డీఎస్పీ వెల్లడించారు. దాడుల్లో అనిశా సీఐ బి.హరి, ఎస్సైలు చిన్నంనాయుడు, సత్యారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 2010లో పాతపట్నం మండలంలో ఉప తసీల్దార్ గా పనిచేస్తున్న సమయంలో నాగభూషణరావు రూ.11 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కారు. అయినా సదరు అధికారి మాత్రం బుద్ధి మార్చుకోలేదు. 

ఇదీచదవండి.

సివిల్స్-2020 ఫలితాలు... సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

Last Updated :Sep 24, 2021, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.