పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి: స్పీకర్ తమ్మినేని

author img

By

Published : Oct 13, 2021, 7:46 PM IST

SPEAKER TAMMINENI

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు చెక్కు అందజేశారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ఆకాంక్షించారు.


శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని పొందూరు మండలంలో వైఎస్సార్ ఆసరా రెండో విడత విడుదల కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం(SPEAKER TAMMINENI AT YSR AASARA FUNCTION) పాల్గొన్నారు. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డ్వాక్రా మహిళలకు నమూనా చెక్కును స్పీకర్ తమ్మినేని అందించారు. మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

వైఎస్సార్ ఆసరా రెండో విడతలో పొందూరు మండలంలోని 1319 సంఘాలకు రూ. 9 కోట్ల 54 లక్షలు డ్వాక్రా మహిళల ఖాతాలో జమ చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. పేదరికం పోయి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నారు.

రైతులకు వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించాలని.. ఒకనాడు వ్యవసాయం దండగ అన్న నాయకులు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. భావితరాలకు మంచి విద్యను అందించేందుకు.. నాడు-నేడు కార్యక్రమాన్ని తెచ్చి మంచి వాతావరణాన్ని కల్పించినట్లు చెప్పారు. మహిళలు, రైతులు ఆర్థికంగా బలపడాలని.. వ్యాపారవేత్తగా తయారవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

ACHENNAIDU: అయ్యయ్యో అచ్చన్న... ఎంత పని అయ్యిందో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.