Govt. Schools : ప్రభుత్వ పాఠశాలల్లో కుళ్లిన గుడ్లు, భోజనం...

author img

By

Published : Sep 23, 2021, 7:12 PM IST

Govt. Schools

విద్యార్థల కోసం ప్రభుత్వ పాఠశాల్లో ఏర్పాటు చేసిన జగనన్న గోరుముద్ద పథకం అమలులో అభాసు పాలవుతోంది. కుళ్లిన గుడ్లు, రుచిలేని భోజనం పెట్టడంపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం సేతుభీమవరం పంచాయతీ పెనసాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది.

ప్రభుత్వ పాఠశాలల్లో కుళ్లిన గుడ్లు, భోజనం...తల్లిదండ్రుల ఆందోళన...

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెనసాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కుళ్లిన కోడిగుడ్లు, రుచిలేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. తినలేక పిల్లలు ఇంటికి వెళ్లి భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. కుళ్లిన గుడ్ల వల్ల పాఠశాల ఆవరణ అంతా దుర్వాసనతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో పెడుతున్న భోజనాలపై ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారని తల్లిదండ్రులు, ఆరోపిస్తున్నారు. పై నుంచి వస్తున్న వాటినే విద్యార్థులకు పెడుతున్నామని.. ఉపాధ్యాయులు చెబుతున్నారు.

గడిచిన రెండు విడతలుగా పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక, పిఎంసి ఎన్నికలు జరగకపోవడంతో పాఠశాల అభివృద్ధి కుంటుపడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : గుప్పెడంత గుండెకు... కొండంత ముప్ఫు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.