కల కరిగింది.. కాలం ఇలా మార్చింది..

author img

By

Published : Jun 20, 2022, 10:51 AM IST

man roaming on road who is applicable for government job in srikakulam

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీదికి చెందిన అల్లక కేదారీశ్వరరావు 1998లో డీఎస్సీ రాసి ఎంపిక జాబితాలో నిలిచారు. అప్పటి నుంచి ఉద్యోగం వస్తుందని ఎదురు చూసి.. రాకపోవడం, కుటుంబ పరిణామాల నేపథ్యంలో.. మానసిక స్థితి సరిగాలేక ఇలా ఎవరేమిచ్చినా.. తింటూ తిరుగున్నాడు. అయితే.. 1998 డీఎస్సీ అభ్యర్థులను ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇటీవల నిర్ణయించగా.. అర్హుల జాబితాలో ఈయన పేరు కూడా ఉండే అవకాశముంది. ఇందుకు సంబంధించిన అంశం సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అల్లక కేదారీశ్వరరావు. డిగ్రీ పూర్తి చేశారు. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ కూడా చేశారు. 1998లో డీఎస్సీ రాసి ఎంపిక జాబితాలోనూ నిలిచారు.. అప్పటి నుంచి ఉద్యోగం వస్తుందని ఎదురు చూసి.. చూసి.. రాకపోవడం, కుటుంబ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మానసిక స్థితి సరిగాలేక ఇలా తిరుగుతున్నారు.

ఈయన గురించి ఎందుకు చెబుతున్నట్లు అనుకుంటున్నారా..? 1998 డీఎస్సీ అభ్యర్థులను ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో అర్హుల జాబితాలో ఈయన పేరు కూడా ఉండే అవకాశముంది. ఇందుకు సంబంధించిన అంశం సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీదికి చెందిన అల్లక నీలకంఠు, అమ్మాయమ్మ కుమారుడు కేదారీశ్వరరావు. 1965లో జన్మించిన ఈయన ఉన్నత చదువులు చదివే సమయంలో భవిష్యత్తులో తప్పకుండా ఉపాధ్యాయ వృత్తిని చేపడతానని అంటుండేవారు. గురువుగా నిలవాలనేదే కోరిక. అందుకు తగ్గట్టుగానే చదువుకున్నారు. 1998లో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికయ్యారు. ఆ సమయంలో తండ్రి చనిపోగా, తల్లితో కలిసి ఉంటుండేవారు.

డీఎస్సీలో ఎంపికైనా ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలం నిరీక్షించి ఆటో నడుపుకొంటూ జీవనం సాగించేవారు. అనంతరం గ్రామంలో దుస్తుల దుకాణం నిర్వహించారు. ఇవేమీ కలిసిరాకపోవడంతో ఉపాధి నిమిత్తం పదేళ్ల కిందట తల్లితో కలిసి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. కొద్ది రోజులకు కన్నతల్లీ అదృశ్యమైంది. దీంతో ఒంటరిగా తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ఉద్యోగం రాకపోవడం, కుటుంబ పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఎనిమిదేళ్ల కిందట మానసిక ఒత్తిడికి గురయ్యారు.

అలా కొద్దిరోజులుగా రోడ్లపై తిరుగుతూ ఎవరేమిచ్చినా తింటూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి తాజా ప్రకటన నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేస్తే ఆ జాబితాలో కేదారీశ్వరరావు ఉంటారని ఈయనతో కలిసి ఎంపికైన అభ్యర్థులు బాడాన ముకుందరావు, గంగు మన్మనథరావు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.