సీజ్‌ చేసిన ఖనిజ శుద్ధీకరణకు టెండరు..

author img

By

Published : Oct 19, 2021, 9:43 AM IST

government tenders for mines

శ్రీకాకుళం జిల్లాలో గతంలో స్వాధీనం చేసుకున్న ఖనిజాన్ని ప్రాసెస్​ చేసేందుకు ఏపీఎండీసీ టెండరు పిలుస్తోంది. ట్రాన్స్‌వరల్డ్‌ గార్నెట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు శ్రీకాకుళం, గార మండలాల్లోని 95.085 హెక్టార్లలో 2002లో బీచ్‌ శాండ్‌ లీజు మంజూరైంది. అయితే లీజుదారు నిబంధనల ప్రకారం మైనింగ్‌లో విఫలమయ్యారంటూ.. కేంద్ర గనుల శాఖ ఆదేశాలతో 2018లో అక్కడ తవ్వితీసిన ఖనిజాన్ని రాష్ట్ర గనుల శాఖ సీజ్‌ చేసింది.

శ్రీకాకుళం జిల్లాలో గతంలో స్వాధీనం చేసుకున్న ఖనిజాన్ని శుద్ధీకరించే అనుభవమున్న గుత్తేదారు కోసం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఈ-టెండరు డాక్యుమెంట్‌ సిద్ధం చేసింది. ట్రాన్స్‌వరల్డ్‌ గార్నెట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు శ్రీకాకుళం, గార మండలాల్లోని 95.085 హెక్టార్లలో 2002లో బీచ్‌ శాండ్‌ లీజు మంజూరైంది. అయితే లీజుదారు నిబంధనల ప్రకారం మైనింగ్‌లో విఫలమయ్యారంటూ.. కేంద్ర గనుల శాఖ ఆదేశాలతో 2018లో అక్కడ తవ్వితీసిన ఖనిజాన్ని సీజ్‌ చేయాలని రాష్ట్ర గనుల శాఖను ఆదేశించింది. దీనికి కస్టోడియన్‌గా ఏపీఎండీసీని నియమించింది. ఆ ఖనిజాన్ని ప్రాసెస్‌ చేసేందుకు తాజాగా ఏపీఎండీసీ టెండరు పిలుస్తోంది. అక్కడ 1.80 మిలియన్‌ టన్నుల నాన్‌-మేగ్నటిక్‌ టైలింగ్స్‌, ఒక మిలియన్‌ టన్ను మేగ్నటిక్‌ టైలింగ్స్‌ను గతంలో సీజ్‌ చేశారు. ప్రస్తుతం వీటిలో ఉండే ఎలిమినైట్‌, గార్నైట్‌, సిమిలినైట్‌, మోనోజైట్‌, లూకాగ్జినైట్‌, రూటైల్‌ వంటి ఖనిజాలను ప్రాసెస్‌ చేసి వేరు చేయనున్నారు. ఇలా ప్రాసెసింగ్‌ చేసేందుకు అనుభవమున్న గుత్తేదారు కోసం టెండరు పిలుస్తున్నారు. ప్రాసెస్‌ చేసిన తర్వాత ఆయా ఖనిజాలను ఏపీఎండీసీ విక్రయించనుంది. టెండరు డాక్యుమెంట్‌ను ఏపీఎండీసీ సోమవారం న్యాయ సమీక్షకు పంపింది. దీనిపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈనెల 27లోపు న్యాయ సమీక్ష వెబ్‌సైట్‌లో తెలపాలంది.

ఇదీ చదవండి: షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు జెన్​కో రాసిన లేఖలో ఏముంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.