తిరుగులేని తీర్పు.. ప‌ట్ట‌భ‌ద్రుల‌కు శిరస్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా.. : నారా లోకేశ్

author img

By

Published : Mar 19, 2023, 3:59 PM IST

నారా లోకేశ్

Yuvagalam padayatra : తిరుగులేని తీర్పు ఇచ్చిన ప‌ట్ట‌భ‌ద్రుల‌కు శిరస్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అరాచ‌క‌స్వామ్యంపై అంతిమ‌ విజ‌యం ప్రజాస్వామ్యానిదేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిందని చెప్పారు. యువగళం పాదయాత్ర 47వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో లోకేశ్ కొనసాగిస్తున్నారు.

Yuvagalam padayatra : అంబేద్కర్ రాజ్యాంగానికి రాజారెడ్డి రాజ్యాంగం తల వంచిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అరాచ‌క‌స్వామ్యంపై అంతిమ‌ విజ‌యం ప్రజాస్వామ్యానిదేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిందని చెప్పారు. ఇది జ‌గ‌న్ ఓట‌మి-జ‌నం గెలుపు అని పేర్కొన్నారు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నా.. పులివెందుల పూల అంగ‌ళ్ల వ‌ద్ద నీ గెలుపు నినాదం మారుమోగిందని తెలిపారు. ఇంక మిగిలింది.. వై నాట్ పులివెందుల‌ అని తెలిపారు. తిరుగులేని తీర్పు ఇచ్చిన ప‌ట్ట‌భ‌ద్రుల‌కు శిరస్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా అన్నారు.

గజమాలతో స్వాగతం... తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రెండో రోజు కొనసాగుతోంది. 47వ రోజు నల్లచెరువు మండలం చిన్నపాల్లోళ్ల పల్లి నుంచి ప్రారంభమైంది. బస కేంద్రం వద్ద సెల్ఫీలతో పాదయాత్ర మొదలైంది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నడిచిన లోకేశ్.. సంజీవుపల్లి వద్ద స్థానికులతో మాట్లాడారు. పెద్ద ఎల్లంపల్లి వద్ద మహిళలు, చిన్నారులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా స్థానికులు, అభిమానులు.. లోకేశ్ కు గజమాలతో స్వాగతం పలికారు.

పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు.. పాదయాత్ర నల్లచెరువు చేరుకోగానే... చేనేత కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నారా లోకేశ్ కు వినతి పత్రం సమర్పించారు. లోకేశ్ ను చూసేందుకు మండల కేంద్రమైన నల్లచెరువుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జాతీయ రహదారి 42 మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది. గాజే ఖాన్ పల్లి వద్ద స్థానికుల సమస్యలను నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ప్యాయలవారిపల్లిలో భోజన విరామం తీసుకోనున్నారు.

46వ రోజు... శనివారం తనకల్లు మండలంలో లోకేశ్ పాదయాత్ర చేశారు. చీకటి మానిపల్లి వద్ద పాదయాత్ర ప్రారంభం కాగా, గంగసానిపల్లి వద్ద టమోటా రైతులతో లోకేశ్ మాట్లాడారు పంటకు గిట్టుబాటు ధర లభించాలంటే ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఈమేకరు సానుకూలంగా స్పందించిన నారా లోకేశ్.. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు మద్దతుగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరు బిసనవారిపల్లి వద్ద వేలాదిగా తరలివచ్చిన బలిజ సామాజిక వర్గానికి చెందిన వారితో లోకేశ్ మాట్లాడారు. బీసీ జాబితాలో చేర్చే అంశంతో పాటు ఈ డబ్ల్యుూఎస్ కోటాకు సంబంధించిన సమస్యను బలిజ కులస్థులు లోకేశ్​కి వివరించారు. కొక్కంటి క్రాస్ వద్ద లోకేశ్​ను చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.