భూరికార్డులు బార్బర్ షాపులో .. ఎక్కడంటే..!

author img

By

Published : Sep 24, 2021, 2:57 PM IST

భూరికార్డులు బార్బర్ షాపులో .. ఎక్కడంటే

భద్రంగా ఉండాల్సిన భూరికార్డులు భార్బర్ షాపులో దర్శనమిచ్చాయి. సస్పెండైన ఓ వీఆర్ఓ సహాయకుడిగా పనిచేసిన వ్యక్తి చేతిలో ఇవి తారసపడ్డాయి. సెలూన్​లో రెవెన్యూ రికార్డులు తిరగేస్తుండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

భూరికార్డులు బార్బర్ షాపులో .. ఎక్కడంటే

ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ కార్యాలయంలో భద్రంగా ఉండవలసిన "భూ"రికార్డులు.. ఓ సెలూన్​లో దర్శనమిచ్చాయి. గొల్లపాలెేనికి చెందిన ఎలిశెట్టి శ్రీనివాసరావు, కురిచేడుకు చెందిన రహంతుల్లా.. సెలూన్​లో రెవెన్యూ రికార్డులు తిరగేస్తుండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. గొల్లపాలెేనికి చెందిన శ్రీనివాసరావు గ్రామానికి చెందిన వార్డు మెంబరు. కురిచేడుకు చెందిన రహంతుల్లా అనిశా వలలో చిక్కి సస్పెండైన వీఆర్​ఓకి సహాయకుడిగా పనిచేశారు. ఆ పరిచయాలతోనే వీరు భూ రికార్డులను బయటకు తెచ్చినట్లు గ్రామస్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం సమగ్ర "భూ" సర్వే నిర్వహిస్తున్న తరుణంలో రికార్డులు బయటి వ్యక్తుల చేతిలో తారస పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చదవండి: GOVT LANDS : ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూములు...తహసీల్దారు కార్యాలయాల్లో మాయాజాలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.