Person suicide: నిండు ప్రాణం తీసిన రూ.2,500 అప్పు... ఎలాగంటే..?

author img

By

Published : Sep 22, 2022, 10:56 AM IST

Updated : Sep 22, 2022, 12:13 PM IST

person commits suicide

Person suicide: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 2,500 రూపాయల అప్పు... ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అసలేం జరిగిందంటే..?

Person suicide: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పాపాయిపల్లికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి బెస్తవారిపేటకు చెందిన ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై అప్పుగా తీసుకున్న అప్పు 2,500 తిరిగి ఇవ్వలేదంటూ దాడికి పాల్పడ్డాడు. అందరి ముందు మస్తాన్ తనను కొట్టాడని ఇజ్రాయిల్ అవమానంగా భావించాడు. కూల్ డ్రింక్​లో పురుగుల మందు కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగానని ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని ఇజ్రాయిల్​ను చికిత్స కోసం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఇజ్రాయిల్ మృతి చెందాడు. ఇజ్రాయిల్ ఇళ్లకు పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వృత్తిరీత్యా మస్తాన్​ ఆటోడ్రైవర్​గా జీవనం సాగిస్తున్నాడు. ఇజ్రాయిల్ పనిచేసే గృహ యజమానులకు పెయింట్ సంబంధిత మెటీరియల్ తరలించే క్రమంలో మస్తాన్​కు ఆటో కిరాయి కింద 2,500 రూపాయల వరకు బాకీ పడ్డాడు.

ఈ క్రమంలో బెస్తవారిపేట పట్టణంలో మస్తాన్​కు ఇజ్రాయిల్ తారసపడ్డాడు. తన అప్పు చెల్లించవలసిందిగా పట్టు పట్టడంతో ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని రెండు, మూడు రోజుల్లో ఇస్తానని ఇజ్రాయిల్.. మస్తాన్​కు తెలిపాడు. ఇజ్రాయిల్ సమాధానంతో సంతృప్తి చెందని మస్తాన్ ఇజ్రాయిల్​ను కొట్టడమే కాకుండా అతని వద్ద నుంచి ఫోన్ లాక్కొని వెళ్లిపోయాడు.

అందరూ చూస్తుండగా ఈ సంఘటన జరగడంతో అవమానంగా భావించిన ఇజ్రాయిల్... పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులు జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇజ్రాయిల్ చావుకు కారకుడైన మస్తాన్​పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

విజయనగరంలో డ్రగ్స్​ కలకలం.. ఇద్దరు అరెస్ట్​

కోఠిలో మహిళ హల్​చల్​.. నా కారుకే చలానా వేస్తావా అంటూ ఫైర్​..!

పొన్నియన్​ సెల్వన్​తో మరోసారి వార్తల్లో త్రిష

Last Updated :Sep 22, 2022, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.