కృషి, పట్టుదలతో..పరిశోధనల స్థాయికి చేరిన ఇస్మాయిల్​

author img

By

Published : Sep 18, 2021, 7:39 PM IST

కృషి, పట్టుదల అ యువకుడి విజయ రహస్యం

ఆ గ్రామానికి అతనే మెుదటి గ్రాడ్యుయేట్...తన చిన్నతనంలోనే తండ్రి చనిపోయినా...కుంగిపోకుండా ఏదైనా సాధించాలనే లక్ష్యం అతన్ని ముందుండి నడిపించింది. తల్లి ప్రోత్సాహం, మేనమామ అండ, గ్రామస్థుల సాయం.. నేడు ఆ యువకున్ని పరిశోధన వైపు వెళ్లేలా చేసింది. అతనే ప్రకాశం జిల్లా చిమట గ్రామానికి చెందిన ఇస్మాయిల్.

సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని నిరూపించాడు ప్రకాశం జిల్లా చిమట గ్రామానికి చెందిన ఇస్మాయిల్. ఆ గ్రామానికి ఆతనే మెుదటి గ్రాడ్యుయేట్..అందుకే ఎదైనా సాధించాలనే సంకల్ప బలం, గ్రామస్థుల అండతో.. ప్లాంట్ల ద్వారా విద్యుత్ తయారీపై పరిశోధన చేస్తున్నాడు.

రాజస్థాన్​లోని జైపూరులో నిర్వహిస్తున్న యూత్ పార్లమెంట్ సమ్మిట్​లో ఇస్మాయిల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన జీవన ప్రయాణం గురించి ఈటీవీ-భారత్​తో పంచుకున్నాడు.

కృషి, పట్టుదల అ యువకుడి విజయ రహస్యం

నా 9వ ఏటనే తండ్రిని కోల్పోయాను. అప్పటినుంచి నా ముఖంపై లేదు. తల్లి, మేనమామ, గ్రామస్థుల సాయంతో నా ప్రయాణాన్ని కొనసాగించాను. నాకు చదువుపై అసక్తి ఉండటంతో.. గ్రామస్థులందరూ డబ్బులు సేకరించి ఉన్నత విద్య కోసం నగరానికి పంపారు. వారి త్యాగాన్ని, నేను వమ్ము చేయకుండా సంకల్ప బలంతో ఈ రోజు ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై పరిశోధన చేస్తున్నాను. కానీ...మా గ్రామంలో ఇప్పటికీ చదువుకునే వాతావరణం లేదు -ఇస్మాయిల్​

యూత్ పార్లమెంట్ సమ్మిట్ వేదికపై.. ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యంపై వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారని ఇస్మాయిల్ వివరించాడు. పరిశోధనతో పాటు ప్రజాస్వామ్యంలో భాగమై తన గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పాడు. అది కూడా పాఠశాల విద్య, రహదారి నిర్మాణంతోనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన గ్రామంలో విద్యార్థులు ఉన్నత చదువును కొనసాగించే ఏర్పాట్లు చేయాలని, అక్కడి ప్రజలకు ప్రాథమిక అవసరాలు తీర్చి ఆ గ్రామ వెనుకబాటు తనాన్ని దూరం చేయాలని కోరాడు.

ఇదీ చదవండి:

తీహార్ జైలుకు వెళ్లివచ్చిన వారు తితిదే బోర్డులో సభ్యులా..? చింతామోహన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.