Agitation with Petrol Bottles: 'అక్రమ కేసులు పెడుతున్నారు.. మమ్మల్ని చంపేస్తాం అంటున్నారు'

author img

By

Published : May 23, 2023, 8:31 AM IST

Agitation with Petrol Bottles

Agitation with Petrol Bottles: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ వియ్యంకుడు భాస్కరరెడ్డి భూ అక్రమాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి కంపెనీ మాజీ ఉద్యోగి ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో భాస్కరరెడ్డి భూ అక్రమాల గురించి లీక్ చేస్తున్నాడనే అనుమానంతో కక్ష కట్టారంటూ ఆంజనేయులు కుటుంబసభ్యులు ఆరోపించారు. పెట్రోల్ బాటిల్స్‌తో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

Agitation with Petrol Bottles: 'అక్రమ కేసులు పెడుతున్నారు.. మమ్మల్ని చెంపేస్తాం అంటున్నారు'

Agitation with Petrol Bottles:మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు భాస్కర రెడ్డి కంపెనీ మాజీ ఉద్యోగి ఆంజనేయులును పోలీసులు అదుపులో తీసుకోవడంపై వివాదం నెలకొంది. విశాఖలో భాస్కర్ రెడ్డి భూ అక్రమాలపై ఇటీవల వరుస కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ఆంజనేయులు లీక్ చేస్తున్నాడనే ఆరోపణలతో అతని మీద కక్ష కట్టారు.

ఆర్థిక లావాదేవీలుపై నరేష్ అనే వ్యక్తి ఆంజనేయులుపై ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ కేసు కట్టారు. ఈ కేసు నిమిత్తం ఆంజనేయులను విచారించేందుకు పోలీస్లు అదుపులోకి తీసుకున్నారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్​కు తీసుకువెళ్లి విచారించారు. మళ్లీ సోమవారం సాయంత్రం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్​కు తీసుకు వచ్చి ఆంజనేయులను విచారిస్తున్నారు.

ఆంజనేయులను మరింత సమగ్రంగా విచారించేందుకు విశాఖకు తరలించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయులు కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టేషన్​కు వచ్చి ఆందోళన చేపట్టారు. విశాఖ తరలిస్తే తాము ఒప్పుకోమని, అంజనేయులకు.. భాస్కర రెడ్డి వర్గీయులు వల్ల ప్రాణ హాని ఉందని ఆరోపించారు.

విశాఖకు తరలిస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ మేరకు వైసీపీ స్టిక్కర్లు అంటించిన వాహనం.. పోలీస్ స్టేషన్ వద్ద ఉండటంతో.. ఆ వాహనంలో ఆంజనేయులను తరలిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు విచారణలో ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.

"ఎనిమిది నెలల క్రితం ఆరోగ్యం బాగాలేదని మానేశారు. నువ్వు మానడానికి లేదు.. మానేస్తే నేను ఊరుకోను అన్నారు. నేను చేయలేనండి అని చెప్పి మానేశారు. చిన్న చిన్న పనులు ఉంటే.. ఫోన్లు చేసి చేపించుకున్నారు. వైజాగ్​లో పీతల మూర్తి యాదవ్.. వాళ్ల అక్రమాలు అన్నీ బయటపెడుతున్నాడు. ఈయన వాళ్లకి సమాచారం ఇస్తున్నాడని అనుమానంతో.. ఏవేవో కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఆ ఆడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. పోలీసులు మా వెనకే ఉన్నారు, పెద్దపెద్ద వాళ్లు మాకు సాయం చేస్తారు అని అంటున్నారు. మమ్మల్ని బెదిరించి.. పోలీసు స్టేషన్​కి తీసుకొచ్చి.. అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఏమో అతనిని వైజాగ్ తీసుకొని వెళ్తాం అంటున్నారు. దీని వెనుక భాస్కర్ రెడ్డి, వాళ్ల ఫ్యామిలీ ఉన్నారు. మమ్మల్ని హత్య చేయాలని చూస్తున్నారు". - పద్మజ, ఆంజనేయులు భార్య

"పోలీసులు కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు. ఏదో కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన వ్యక్తిని ఇప్పటి వరకూ తీసుకొనిరాలేదు. అధికారంలో ఉన్నారని.. పోలీసులు వాళ్లకి వత్తాసు పలుకుతున్నారు". - వినోద్, ఆంజనేయులు బంధువు

"కేసు విచారణలో ఉంది. విచారణలో భాగంగా అతనిని విచారించడం జరుగుతుంది. ఫోర్జరీ కేసు అది. దేనితో కూడా సంబంధం లేదు. వాళ్లు చెప్పేది అంతా అబద్ధం". - రాంబాబు, సీఐ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.