సీబీఐ విచారణను స్వాగతిస్తున్నా: సోమిరెడ్డి

author img

By

Published : Nov 24, 2022, 2:10 PM IST

SOMIREDDY

SOMIREDDY : నెల్లూరు కోర్టులో దస్త్రాలు అపహరణ కేసును హైకోర్టు.. సీబీఐకి అప్పగించటంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మాయమైన దస్త్రం ఫిర్యాదుదారుడిని తానే కాబట్టి.. తన అభిప్రాయమూ సీబీఐ తీసుకోవాలన్నారు.

సీబీఐ విచారణను స్వాగతిస్తున్నా

SOMIREDDY ON HIGH COURT JUDEGEMENT OVER THEFT IN NELLORE COURT : నెల్లూరు కోర్టులో దస్త్రాలు అపహరణ కేసును హైకోర్టు.. సీబీఐకి అప్పగించడాన్ని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలపై తమకు నమ్మకం లేదని కోర్టు కూడా చెప్పినట్లైందని ఆయన పేర్కొన్నారు. సీబీఐ విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మాయమైన దస్త్రం ఫిర్యాదుదారుడిని తానే కాబట్టి.. తన అభిప్రాయమూ సీబీఐ తీసుకోవాలన్నారు.

కాకాని వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఘోరమైన నేరాలు చేసే కాకానిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. వివేకా హత్య కేసులా నాన్చకుండా తొందరగా కేసు దర్యాప్తును పూర్తి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ సహా స్థానిక అధికారుల్ని తప్పించి, న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలని కోరారు.

"నెల్లూరు కోర్టులో సాక్ష్యాల చోరీ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా. తప్పుడు పత్రాలతో అసత్య ఆరోపణలపై కాకాణిపై నేనే కేసు పెట్టా. కాకాణివి తప్పుడు పత్రాలని విచారణలో తేలి ముగ్గురు అరెస్టయ్యారు. కేసు కీలక దశలో ఉండగా కాకాణికి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి వచ్చిన మరుసటిరోజే కేసు సాక్ష్యాలు పోయాయి. కోర్టులోని 4 వేల దస్త్రాల్లో ఒక్క కాకాణి దస్త్రమే పోయిందా?. కాకానికి మానవత్వం ఉంటే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి"-సోమిరెడ్డి, టీడీపీ నేత

సీబీఐకి అప్పగింత: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పి.కె.మిశ్రా ఆదేశాలు జారీచేశారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. కేసును సీబీఐకి అప్పగించినా తమకు అభ్యంతరం లేదని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) గతంలో ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.

అప్పట్లో సీబీఐ డైరెక్టర్‌, డీజీపీ, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తిరిగి నేడు మళ్లీ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏం జరిగిందంటే..: నెల్లూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏప్రిల్​ 13న అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఓ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు ఎత్తుకెళ్లారు. మిగిలిన వాటిని కాలువలో పడేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య నడుస్తున్న ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించిన పత్రాలను దొంగలు ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టించింది.

అపహరణకు గురైన పత్రాలు అవేనా?: సర్వేపల్లి ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2017లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై విలేకర్ల సమావేశంలో పలు విమర్శలు చేశారు. వివిధ పత్రాలు చూపించి హవాలాకు పాల్పడ్డారని ఆరోపించారు. దానిపై సోమిరెడ్డి.. తప్పుడు పత్రాలు చూపించి తనపై బురద జల్లుతున్నారని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు మరికొందరిపై కేసు పెట్టారు. కాకాణిపై పరువునష్టం దావా దాఖలు చేేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.