Medical Students: గ్రామీణ ప్రాంతాలపైనే ప్రత్యేక దృష్టి.. తమతో కలిసిరావాలంటూ యువతకు పిలుపు..

author img

By

Published : May 17, 2023, 12:14 PM IST

nellore Medical students service in rural areas

Medical Students Service: ఏసీ గదుల్లో ఉద్యోగమే యువత లక్ష్యం కాకూడదు.. సాటి వారికి సాయం చేయడంలోనే సంతృప్తిని వెతుక్కోవాలంటున్నారు ఆ వైద్య విద్యార్థులు. అందుకోసం సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రక్తదాన శిబిరాలు, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు, హెల్త్‌క్యాంప్‌ వంటివి నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటువంటి సమాజహిత కార్యక్రమాలు చేపడుతున్న నెల్లూరు ఏ.సీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులపై ప్రత్యేక కథనం మీకోసం..

గ్రామాల్లో వైద్యంపై మెడికల్ స్టూడెంట్స్ ప్రత్యేక దృష్టి

Medical Students Service: వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యుడికి సమాజంలో అంతటి ప్రాధాన్యత ఉంది. అయితే వైద్యం పేరుతో దండిగా దండుకుంటారనే పేరు కూడా సమాజంలో ఉంది. ఇలాంటి పేరును పోగొట్టేందుకు నెల్లూరు వైద్య విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పేదల కోసం వృత్తిని కొనసాగిస్తామని చెబుతున్నారు. మెడికల్ కళాశాలలో చదువుకుంటూనే సేవ కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు.

సాధారణంగా గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికోసం మేము ఉన్నాం అంటున్నారు.. నెల్లూరు జీజీహెచ్ వైద్య విద్యార్థులు. ఈ మేరకు గ్రామాలలో సర్వేలు చేస్తూ.. వైద్య అవసరాలను గుర్తిస్తున్నారు. 150 మంది వైద్య విద్యార్థులు బృందంగా ఏర్పడి పనిచేస్తున్నారు. కళాశాలలో చదువుతోపాటు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ జూడో అసొసియేషన్ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో వీరు పనిచేస్తున్నారు.

అందుకోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. 'అందరి ప్రాణాలు కాపాడదాం' అనే నినాదంతో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కొవిడ్ తర్వాత గ్రామాల్లో బ్లడ్‌ డొనేషన్ అంటేనే భయపడుతున్నారు. ఈ విషయంపై ఆ విద్యార్థులు ప్రత్యేక పరిశీలన చేశారు. గ్రామాల్లో కొందరు యువతను తమ బృందంలో చేర్చుకుని వారి ద్వారా గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కాలంలో బ్లడ్ బ్యాంకుల్లో నిల్వల కొరత ఉంది. ఈ కొరతను భర్తీ చేసేందుకు వైద్య విద్యార్థుల యూనియన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది.

తమతోపాటు గ్రామాల్లో ఉన్న యువత ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. యువత పూర్తిగా చదువుకే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా సమయం కేటాయించాలని అంటున్నారు ఆ విద్యార్థులు. సమయాన్నంతా సామాజిక మాధ్యమాల్లో వృథా చేసుకోకుండా ఉండాలంటున్నారు. ఎదుటివారికి సాయం చేయడమే తమ ముఖ్య ఉద్దేశం అని చెబుతున్నారు.. ఆ వైద్య విద్యార్థులు. ఈ నేపథ్యంలో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తమ సేవలను అందిస్తున్నారు.

వన్‌ జీరో ఎయిట్ (108)తో కలిసి పనిచేస్తూ.. హాస్పిటల్స్​ లేని గ్రామాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరి జూనియర్స్‌ కూడా వీరి బాటలోనే నడుస్తూ వారికి తోడ్పాటును అందిస్తున్నారు. ర్యాగింగ్‌ వంటి దుర్మార్గాల్లో పాల్గొనకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న విద్యార్థులను అందురూ ప్రశంసిస్తున్నారు. గ్రామాల్లోని మిగతా యువత కూడా తమతో కలిసి రావాలని ఆ విద్యార్థులు కోరుతున్నారు.

"ఎటువంటి హాస్పిటల్ సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసేందుకు మేము ప్రతి నెలకు ఒకసారి వెళ్లి విలేజ్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. ఇప్పుడున్న మా స్టూడెంట్స్ మాత్రమే కాకుండా.. నర్సింగ్ స్టాఫ్, ఇప్పటి యువతి కూడా మాతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము." - వైద్య విద్యార్థి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.