ganja illegal smuggling నెల్లూరులో గంజాయి అక్రమ రవాణ నివారణ కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్..

author img

By

Published : May 25, 2023, 5:38 PM IST

ganja illegal smuggling

ganja illegal smuggling in Nellore: నెల్లూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికడతామని జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో గంజాయి అక్రమ వినియోగం, రవాణపై పోలీసులు దృష్టిపెట్టాలని కలెక్టర్ కోరారు. అసాంఘీక ప్రాంతాలను గుర్తించి తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. గంజాయి, వినియోగం, అక్రమ రవాణ నివారణ కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14500 పోస్టర్​ను కలెక్టర్, ఎస్పీ విడుదల చేశారు.

ganja illegal transportation: నెల్లూరు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో గంజాయి అక్రమరవాణా, వినియోగం జరుగుతుంది. పోలీసులు ఇటీవల అనేక సార్లు దాడులు చేసి భారీగా గంజాయిని పట్టుకున్నారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు మూడో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఏ విధంగా అరికట్టవచ్చో క్షేత్ర స్థాయి సిబ్బందితో చర్చించారు.

నేషనల్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ పోర్టల్జి జిల్లాస్థాయి కమిటీ: జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నేషనల్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ పోర్టల్జి జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అవగాహన కల్పించాలని కోరారు. అసాంఘిక ప్రదేశాలను గుర్తించాలని పోలీసులకు అధికారులు సూచించారు. ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని, సీసీ కెమోరాల ద్వారా రవాణాను గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. గంజాయి నివారణకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధానంగా పాఠశాలలు, జూనియర్ ళాశాలల సమీపంలోని దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గంజాయి వినియోగం వల్ల కలిగేటువంటిదుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. స్థానిక పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ తో అలాంటి ప్రదేశాలను గుర్తించేలా ప్రణాళికను రూపొందించినట్లు సమావేశంలో వెల్లడించారు. చీకటి ప్రదేశాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం. ఆర్టీసీ బస్సులు, పార్సిల్ రవాణా వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల ఆవరణలో తనిఖీలు: మందుల దుకాణాల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే ఇంజక్షన్లు, మాత్రలు ఇవ్వకుండా చర్యలు చేపట్టాలని ఔషధ నియంత్రణ అధికారులకు కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాలు జారీ చేశాడు. స్థానికంగా ఉండే మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల ఆవరణలో తనిఖీలు చేపట్టి అమ్మకాలు, వినియోగం లేకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు ఉన్నతాధికారులు కళాశాలలకు యూనిఫామ్​తో విద్యార్థులకు అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అటవీ ప్రాంతంలో ఎక్కడా గంజాయి సాగు, రవాణా లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెల్లడించారు.

గంజాయి వినియోగంపై అవగాహన: గంజాయి అక్రమ రవాణపై నిఘా కోసం వివిధ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. ఇందు కోసం కమీటి సభ్యులందరూ సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు గంజాయి అక్రమలపై అవగాహన కల్పించనున్నట్లు ఎస్పీ తెలిపారు. తీర ప్రాంతంలో మత్స్యశాఖ, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి మత్స్యకారులకు అవగాహన కల్పిస్తామని తిరుమలేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు.

ఇవీ చదవండ:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.