అక్రమ వాటర్ ప్లాంట్‌ను తొలగించాలంటూ నోటీసు.. ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
Updated on: Jan 23, 2023, 8:22 PM IST

అక్రమ వాటర్ ప్లాంట్‌ను తొలగించాలంటూ నోటీసు.. ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
Updated on: Jan 23, 2023, 8:22 PM IST
MLA Started Illegal Pipeline Connection Water Plant: అక్రమ వాటర్ ప్లాంట్ ను తొలగించాలంటూ.. అధికార్లు నోటీసు ఇచ్చినా, ఎమ్మెల్యే ప్లాంట్ ను ప్రారంభించడం నెల్లూరు జిల్లాలో చర్చాంశనీయమైంది. నెల్లూరు జిల్లాలోని శెట్టి సముద్రం గ్రామంలో నిబంధనలకు విరుద్దంగా పైపులైను కనెక్షన్ తీసుకొని వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ప్రారంభానికి ఎమ్మెల్యేనే రావడంతో ఈ ఘటన ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
MLA Started Illegal Pipeline Connection Water Plant: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం శెట్టి సముద్రం గ్రామంలో.. వైసీపీ నేతలు వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని ఆహ్వానించారు.
అయితే, ప్రారంభోత్సవానికి ముందే, వాటర్ ప్లాంట్‌కు అక్రమ పైప్‌లైన్ ఇచ్చారని.. కనెక్షన్ తొలగించాలని.. అధికారులు వాటర్ ప్లాంట్‌కు నోటీసు అంటించారు. నోటీసు అంటించి ఉన్నా, ఎమ్మెల్యే వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. దీంతో స్థానికులు ఔరా.. ! అంటూ ముక్కున వేలు వేసుకున్నారు. అయితే, ఇది నియోజక వర్గంలో పార్టీల అంతర్గత పోరులో భాగంగా.. ఈ వాటర్ ప్లాంట్ రాజకీయాలు జరిగాయనే వాదన జరుగుతోంది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వర్గం వారు పాల్గొనక పోవటం విశేషం. అక్రమ కనెక్షన్ తీసుకొని.. దాని ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేని పిలిచి.. అవమానపరిచారని ప్రజలు అంటున్నారు. అక్రమంగా నీటి కనెక్షన్ ఇవ్వటంపై.. సర్పంచ్ వర్గం వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
