ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. కండక్టర్ చాకచక్యంతో

ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. కండక్టర్ చాకచక్యంతో
Bus Accident: ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చిన కారు ఢీ కొట్టిన ఘటన నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం టోల్గేట్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ కింద పడిపోగా.. డ్రైవర్ లేకుండానే బస్సు కొంత దూరం మేర ముందుకు దూసుకెళ్లింది. కండక్టర్ చాకచక్యంగా బ్రేక్పై కాలు వేసి బస్సును అదుపు చేశారు. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Bus Accident In Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం టోల్గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి డిపో నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ కిందపడిపోగా.. డ్రైవర్ లేకుండానే బస్సు కొంతదూరం మేర ముందుకెళ్లింది. చాకచక్యంగా వ్యవహరించిన బస్సు కండక్టర్ బ్రేక్పై కాలు వేసి బస్సును అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణిస్తుండగా.. 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా.. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవటంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి
