అప్పులు తీర్చేందుకు దారి తప్పాడు.. కటకటాల పాలయ్యాడు

author img

By

Published : Mar 1, 2023, 9:15 PM IST

Etv Bharat

Gold Chain Theft In Palakonda : చాలా మందికి డబ్బులు అవసరమైతే కష్టపడి సంపాదించుకుంటారు.కానీ కొంతమంది మాత్రం దానికి విరుద్ధం. తరువాత పరిస్థితులు చూసిన తరువాత ఎందుకు చేశామా అని బాధ పడతారు. అతను అప్పులు తీర్చడానికి చాకచక్యంగా చోరీ చేశాడు. ఇప్పుడు అతన్ని ఖాకీలు కటకట్టాల్లోకి నెట్టారు.

Gold Chain Theft In Palakonda : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ముదునూరి వారి వీధిలో జరిగిన బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పాలకొండ మండలం ఎన్​కే రాజపురం గ్రామానికి చెందిన మెంతి మణికంఠ దొంగతనానికి పాల్పడినట్లు డీఎస్పీ క్రిష్ణారావు తెలిపారు. నిందితుడు నుంచి 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లగా పాలకొండ సీఐ అధ్వర్యంలో టీమ్​లు ఏర్పాటు చేసి కేసును ఛేదించామన్నారు.

ఐదు బృందాలతో గాలింపు : ఏలం కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మణికంఠను ఎస్సై, ప్రత్యేక బృందం సభ్యులు పట్టుకొని విచారించగా తప్పు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదించేందుకు ఎస్పీ ఆదేశాలతో 5 బృందాలను నియమించామని అన్నారు. సీసీ టీవీ పుటేజి, క్రిమినల్‌ కేసు బృందం విచారణ కీలకంగా మారాయని అన్నారు. నిందితుడు కాజేసిన నాలుగు తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ చోరీని ఛేదించడంలో కృషి చేసిన హోం గార్డ్ రమేష్, పీసీ రాజేష్, ఏఎస్ఐ శంకర్ రావు, సీసీఎస్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దామోదర్ రావులను డీఎస్పీ క్రిష్ణా రావు అభినందనలు తెలియజేశారు.

దొంగతనం ఎప్పుడు.. ఎక్కడ జరిగింది..? : ముదునూరి వారి వీధిలో నివాసం ఉంటున్న వడ్డీ కమలమ్మ అనే వృద్ధ మహిళ ఇంట్లో ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో గమనించిన మెంతి మణికంఠ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. వీధిలో కనుచూపుమేరలో ఎవ్వరూ లేకపోవడంతో తన పని సులువు అయ్యింది. ఫిబ్రవరి 21న ముదునూరు వారి వీధిలో ఉన్న కమలమ్మ ఇంటికి వెళ్లాడు. ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. దాహంగా ఉందని, తాగేందుకు నీళ్లు ఇవ్వాలని అడిగాడు. ఆమె వెనక్కి తిరుగుతుండగా మెడలోని బంగారు గొలుసు దొంగతనం చేసి తలుపు గడియ పెట్టి పరారయ్యాడు.

అప్పులు తీర్చేందుకు.. : పాలకొండకు చెందిన మెంతి మణికంఠ ఇటీవల ఎన్‌కే రాజపురంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. 10 సంవత్సరాల క్రితం తల్లితో ఉపాధి నిమిత్తం చెన్నై వెళ్లాడు. చెన్నైలో అప్పులు ఎక్కువగా చేయడంతో వాటిని తీర్చాలని ఒత్తిడి పెరగింది. అప్పులు తీర్చాలనే ఉద్ధేశ్యంతో దొంగతనం చేశాడని తెలిసింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.