సీబీఐ అధికార్లకు మరో లేఖ రాసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి..
Published: Jan 28, 2023, 12:47 PM


సీబీఐ అధికార్లకు మరో లేఖ రాసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి..
Published: Jan 28, 2023, 12:47 PM
MP YS Avinash Reddy : వివేకా హత్య కేసులో ఈ రోజు సాయంత్రం 3గంటలకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐకి లేఖ రాశారు. అందులో ఆయన సీబీఐకి ఏం తెలిపారంటే..
YS Avinash Reddy : వివేకా హత్య కేసులో తన ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందంటూ.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరగకుండా చూడాలని కోరారు. వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని, సీబీఐ విచారణను రికార్డ్ చేసేందుకు అనుమతించాలన్నారు. తనతో పాటు ఓ న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. వివేకా హత్య కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చి.. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
వైఎస్ విజయమ్మతో భేటీ.. అంతకముందు లోటస్‌పాండ్‌కు వెళ్లినట్లు వైఎస్ అవినాష్ తెలిపారు. అక్కడ వైఎస్ విజయమ్మతో కలిసి మాట్లడినట్లు వివరించారు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు హాజరవుతున్నట్లు అవినాష్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి :
