నందిగామలో మాజీ సైనిక ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం
Published: Mar 14, 2023, 9:09 PM


నందిగామలో మాజీ సైనిక ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం
Published: Mar 14, 2023, 9:09 PM
EX SERVICEMEN ASSOCIATION: జనరల్ కరియప్ప మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనికుల కుటుంబాల సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సైనిక ఉద్యోగుల సంక్షేమ అధికారి వెంకటరామి రెడ్డి సహా పలు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా మాజీ సైనికులు, మాజీ సైనిక కుటుంబాలకు ఉచిత వైద్య శిబరం నిర్వహించారు.
EX SERVICEMEN ASSOCIATION: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జనరల్ కరియప్ప మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనికుల కుటుంబాల సమావేశం నిర్వహించారు. స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ మాజీ సైనిక్ ఉద్యోగుల సమావేశానికి రాష్ట్ర సైనిక ఉద్యోగుల సంక్షేమ అధికారి వెంకటరామి రెడ్డి, జిల్లా అధికారిని కళ్యాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు, మాజీ సైనిక ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
మాజీ సైనికుల కుటుంబానికి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు కూడా అందజేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన రాష్ట్ర సైనిక ఉద్యోగుల సంక్షేమ అధికారి వెంకటరామి రెడ్డి.. ఒకప్పటి కంటే ఇప్పుడు సైన్యంలో మంచి ఎక్విప్మెంట్స్ వచ్చాయని అన్నారు. సైనిక ఉద్యోగులు, మాజీ సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా వీర సైనికుల కుటుంబాలకు 300 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని ఆయన తెలిపారు.
దీని ప్రకారం వీరమరణం పొందిన సైనికుల గుర్తించి వారికి ఈ స్థలం అందేలా చూస్తున్నామని వెంకటరామి రెడ్డి అన్నారు. మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు. పెన్షన్‌తో పాటు ఇతర ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
"నేను ఈ అధికారంలో చేరినప్పుడు మాజీ సైనిక ఉద్యోగులు, మాజీ సైనిక కుటుంబాలకు కొన్ని సమస్యలు ఉండటం గమనించాను. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాము. అయితే ఒకప్పటి కంటే ఇప్పటి సైన్యంలో మంచి ఎక్విప్మెంట్స్ వచ్చాయి. వీర మరణం చెందిన సైనిక కుటుంబానికి 300 చదరపు గజాల స్థలం ఉచితంగా అందించాలని 2005 సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం వీరమరణం పొందిన సైనికుల గుర్తించి వారికి ఈ ఉచిత స్థలాలు అందేలా మేము చూస్తున్నాము." - వెంకటరామి రెడ్డి, రాష్ట్ర సైనిక ఉద్యోగుల సంక్షేమ అధికారి
ఇవీ చదవండి:
