సీఎం జగన్‌తో జోయాలుక్కాస్ ఎండీ భేటీ.. పెట్టుబడులపై చర్చ

సీఎం జగన్‌తో జోయాలుక్కాస్ ఎండీ భేటీ.. పెట్టుబడులపై చర్చ
Joy Alukkas met CM Jagan: రాష్ట్రంలో పెట్టుబడులపై జోయాలుక్కాస్‌కు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రముఖ జువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్ చైర్మన్ అండ్ ఎండీ అలుక్కాస్ వర్గిస్ జాయ్‌కు సీఎం ఈ మేరకు హామీ ఇచ్చారు.
Joy Alukkas met CM Jagan in AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జోయాలుక్కాస్‌కు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. తనను కలిసిన ప్రముఖ జువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్ చైర్మన్ అండ్ ఎండీ అలుక్కాస్ వర్గిస్ జాయ్‌కు సీఎం ఈ మేరకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఇవీ చదవండి:
