సీఎం జగన్ శ్వేత పత్రం విడుదల చేయాలి: పోతిన మహేష్
Published: Jan 31, 2023, 1:02 PM


సీఎం జగన్ శ్వేత పత్రం విడుదల చేయాలి: పోతిన మహేష్
Published: Jan 31, 2023, 1:02 PM
Janasena Party Leader Pothina Mahesh: వైఎస్సార్సీపీ పాలనపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధి విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Janasena Party Leader Pothina Mahesh: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. ప్రభుత్వ విధి విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పాలన పేరుతో అప్పులు చేసి ఆ డబ్బులను ప్రజల ఖాతాల్లో వేస్తున్నామని చెప్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపించడంలో విఫలమయ్యారన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ముఖ్యమంత్రి జగన్ బందిపోటు ముఠా రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా అప్పులు, క్రైమ్ రేట్లో నెంబర్ వన్ అయిందని విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమలు లేకుండా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి మీద శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు.
ఇవీ చదవండి
